ఒకప్పుడు బాలీవుడ్ స్టార్స్( Bollywood stars ) సౌత్ సినిమాలను చిన్నచూపు చూసేవారు.కనీసం సౌత్ సినిమాల గురించి మాట్లాడేందుకు కూడా ఆసక్తి చూపించేవారు కాదు.
కానీ ఇప్పుడు పరిస్థితి మారింది.రాజమౌళి దయ వల్ల ఇతర కొంత మంది సౌత్ దర్శకుల దయ వల్ల హిందీ నటీ నటులు సౌత్ సినిమాల వైపు చూస్తున్నారు.
తెలుగు మరియు తమిళంతో పాటు ఇతర సౌత్ భాషల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.కొందరు స్టార్స్ ఏరి కోరి మరీ తెలుగు సినిమా ల్లో నటించేందుకు సిద్ధం అవుతున్నారు.
ఒకప్పుడు బాహుబలి వంటి భారీ సినిమా లో నటించేందుకు నో చెప్పిన దర్శకుడు సంజయ్ దత్( Sanjay Dutt ) ఇప్పుడు ప్రభాస్ సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే.మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రభాస్ సినిమా లో సంజయ్ దత్ తాత పాత్ర ను పోషిస్తున్న విషయం తెల్సిందే.
ఇక టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ( Saif Ali Khan )కూడా ఉవ్విల్లూరుతున్నాడు.ఇప్పటికే ఆయన ఆదిపురుష్ సినిమా లో ప్రభాస్ తో కలిసి నటించాడు.

ఆ సినిమా ఇంకా విడుదల అవ్వకుండానే ఎన్టీఆర్ 30 లో విలన్ పాత్రను చేసేందుకు సిద్ధం అయ్యాడు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ రెండు సినిమా ల్లో కూడా వీరిద్దరు నటించడం వల్ల అంచనాలు పెరుగుతున్నాయి.వీరిద్దరు మాత్రమే కాకుండా టాలీవుడ్ లో ఎంతో మంది బాలీవుడ్ స్టార్స్ కూడా నటిస్తున్నారు.సౌత్ కు ఉన్న డిమాండ్ నేపథ్యం లో బాలీవుడ్ హీరోయిన్స్ కూడా ఈ మధ్య కాలంలో తెలుగు లో నటించేందుకు ఆసక్తిగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఆకట్టుకునే కథ మరియు కథనాలతో తెలుగు సినిమాలు వస్తున్నాయి.కనుక బాలీవుడ్ వారు టాలీవుడ్ వైపు చూస్తున్నారు.బాలీవుడ్ లో దక్కించుకోలేక పోయిన సక్సెస్ లు సౌత్ లో అయినా సక్సెస్ అయ్యేనా చూడాలి.







