ఒకప్పుడు సౌత్ సినిమాలంటే హిందీ సినిమా వాళ్లకు చిన్నచూపు ఉండేది.ఇప్పుడు సౌత్ సినిమాలు వేల కోట్ల వసూళ్లు సాధిస్తూ హిందీ సినిమాలను బీట్ చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అదే బాలీవుడ్(Bollywood) వాళ్లు కుళ్లుకుంటున్నారు.
తమ సినిమాలకు దక్కని గౌరవం మరియు కలెక్షన్స్ సౌత్ సినిమాలకు వస్తున్నాయి అంటూ కడుపులో రగిలి పోతున్నట్లుగా అనిపిస్తోంది.అందుకే బుద్దిలేని బాలీవుడ్ వారు మన నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు(oscar award) దక్కితే చాలా తక్కువ శాతం మంది మాత్రమే స్పందించారు.
ఇండియన్ సినిమాకు ఆస్కార్ వచ్చింది అనే సంతోషాన్ని వారు వ్యక్తం చేయలేదు.సోషల్ మీడియాలో కూడా ఆర్ ఆర్ ఆర్ టీమ్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ చిన్న పోస్ట్ పెట్టలేదు.
ఇంతటి చిన్న మనసు వారిది అని దీంతో మరోసారి అర్థం అయ్యింది.మన ఇండియన్ సినిమా కు ఆస్కార్ దక్కిందే అనే సంతోషం కంటే హిందీ సినిమాకు కాకుండా సౌత్ సినిమాకు ఆస్కార్ దక్కిందని వారు ఈగో తో కొట్టుకుంటున్నట్లుగా దీన్ని బట్టి అర్థం అవుతోంది.

అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న నాటు నాటు పాట(naatu naatu) ఆస్కార్ కు ఎంపిక అయ్యింది.దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా అలరించిన నాటు నాటు పాటకు గతంలో బాలీవుడ్ వారు పలు సందర్భాల్లో స్టెప్స్ వేసి తమ పాపులారిటీని పెంచుకునేందుకు ప్రయత్నించారు.కానీ ఇప్పుడు మాత్రం ఆస్కార్ గురించి స్పందించేందుకు ఆసక్తి చూపించడం లేదు.ఆస్కార్ అవార్డు యొక్క గొప్పతనం వారికి తెలుసు.ఆస్కార్ రావాలంటే ఎంతటి కఠిన శ్రమను ఎదుర్కోవాలో కూడా వారికి తెలుసు.అయినా కూడా ఆస్కార్ అవార్డు నాటు నాటుకు రావడం పట్ల వారు ప్రశంసించలేక పోతున్నారు.
అందుకు కారణం ఏంటీ అనేది వారే చెప్పాలి.ఒక ఇండియన్ సినిమాగా వారు చూస్తున్నారా లేదా అనేది కూడా వారు ఈ సందర్భంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.







