నాయకుల మద్య ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ క్రమశిక్షణ విషయంలో బిజెపి (Bjp)మిగతా పార్టీల కంటే భిన్నమని, ఆర్ఎస్ఎస్ బావజాలం అనువణువునా నింపుకున్న క్రమశిక్షణ గల కార్యకర్తలు గల పార్టీ గా బాజాపా కి మంచి పేరు ఉంది .అంతర్గత సమావేశాలలో ఎలా చర్చించుకున్నా కూడా బయటకు వచ్చేసరికి అంతా ఒక మాట మీద ఉంటారు.
కాంగ్రెస్ పార్టీ(Congress party) లాగా అధిస్తానం గీసిన గీతను దాటే నాయకులు బిజేపి లో కనపడరు.అయితే ఇప్పుడు ఆ పరిస్థితి మెల్లగా మారుతున్నట్లుగా కనబడుతుంది.
కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత మీద బండి సంజయ్(Bandi Sanjay) వ్యాఖ్యలు ఖండించాల్సినవే రాజకీయ పార్టీలతో పాటు సామాన్య జనాల్లో కూడా బండి సంజయ్ వ్యాఖ్యలపై వ్యతిరేకత కనిపించింది.అయితే తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మీద దర్మపురి అరవింద్(Dharmapuri Arvind) వ్యాఖ్యలు మాత్రం కొంత సంచలనం కలిగించాయని చెప్పవచ్చు.
ఆయన మాట్లాడిన తీరు చూస్తే బండి సంజయ్ ప్రస్తుత వ్యాఖ్యల మీద అసంతృప్తి కన్నా ఆయన నడుస్తున్న విధానం పట్ల ఈయనకున్న వ్యతిరేకత కనిపించింది.

అధ్యక్ష స్థానం అంటే పవర్ సెంటర్ కాదని కోఆర్డినేట్ సెంటర్ మాత్రమే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇద్దరి మధ్య ఉన్న కనిపించని దూరాన్ని బట్టబయలు చేశాయి అరవింద వ్యాఖ్యలకు మద్దతుగా మరికొంతమంది శృతి కలపడం చూస్తూ ఉంటే బయటకు కనిపించని లుకలుకలు పార్టీలో చాలా ఉన్నాయని తెలుస్తుంది.విభేదాలు ఏమైనా ఉంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించుకోవాలే తప్ప ఇలా ఓపెన్ గా బయటకు చెప్పడం కాషాయ శిబిరంలో గుబులు పుట్టిస్తుంది.ఈ సారి తెలంగాణా లో కచ్చితంగా విజయం సాదించాలని అమిత్ షా(Amit Shah) పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసి వెళ్లిన రోజుల వ్యవధిలోనే ఇలా జరగటం పై భాజపా వర్గాలు కూడా ఆందోళన పడుతున్నాయి.
అసలు వీళ్లదరి మద్యా ఏ విషయంలో గ్యాప్ వచ్చింది ఎన్ని రోజుల నుంచి ఎడముకం పెడముకంగా ఉన్నారు అంటూ ఇప్పుడు అధిష్టానం ఆరా తీసే పనిలో పడింది… ఏది ఏమైనా క్రమ శిక్షణకు కు మారుపేరు అని చెప్పుకునే పార్టీలో ఇలా గొడవలు జరగడం చూస్తూ ఉంటే భాజపా పార్టీ కూడా కూడా క్రమంగా మిగతా పార్టీల లాగా మారుతున్నది అని అర్థమవుతుంది .మరి రాష్ట్రస్థాయి రాష్ట్ర నేతలు గొడవలపై కేంద్రం అధిష్టానం ఏ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.







