నేషనల్ అవార్డు రావడంతో బన్నీపై ప్రశంసలు కురిపించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ !

మెగా కుటుంబం లోనే కాకుండా తెలుగు ఇండస్ట్రీలోనే మొట్టమొదటి సారిగా తొలి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకుని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రికార్డ్ క్రియేట్ చేసారు.

దీంతో అల్లు ఫ్యాన్స్ మామూలు సంతోషంగా లేరు.

బన్నీ జాతీయ అవార్డు( National Award ) అందుకోవడంతో తెలుగు ఇండస్ట్రీ నుండి మాత్రమే కాకుండా పక్క ఇండస్ట్రీల నుండి కూడా ప్రశంసలు దక్కుతున్నాయి.

ఇక తమ అభిమాన హీరోకి అవార్డు రావడంతో అల్లు అర్జున్( Allu Arjun ) ఫ్యాన్స్ ఆకాశంలో తేలిపోతున్నారు.ఈ విషయంలో బన్నీ సైతం ఖుషీగా ఉన్నారు.పుష్ప సినిమా( Pushpa movie )కు తాను పెట్టిన ఎఫర్ట్ కు తగిన ఫలితం అయితే రావడంతో ఇప్పుడు ఈయన కూడా మస్తు ఖుషీగా ఉన్నారు.

ఇక బాలీవుడ్ వర్గాల నుండి కూడా విమర్శించే వారు విమర్శిస్తుంటే ప్రశంసించే వారు ప్రశంసిస్తున్నారు.

Advertisement

మరి తాజాగా అల్లు అర్జున్ కు కృతి సనన్ ( Kriti Sanon )కూడా అభినందనలు తెలుపుతూ ప్రశంసలు కురిపించింది.ముందుగా బన్నీ కృతి సనన్ కు మిమి సినిమా కోసం ఉత్తమ నటిగా అవార్డు రావడంతో ఆయన సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ తెలిపాడు.దీనికి స్పందిస్తూ ఆమె థాంక్స్ చెబుతూ అల్లు అర్జున్ కు అవార్డు రావడంపై తన పోస్ట్ లో స్పందించింది.

ఈమె చెబుతూ.పుష్పగా బన్నీని చూసినప్పుడు మైండ్ బ్లాంక్ అయ్యిందని.

తన వర్క్ కు ఫిదా అయ్యానంటూ చెప్పుకొచ్చింది.ఇక నేషనల్ అవార్డుకు నువ్వు చాలా అర్హుడివి అని అతడిపై ప్రశంసలు కురిపించింది.

ఈమె చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ వైరల్ చేసేస్తున్నారు.ఏది ఏమైనా బన్నీ పుష్పరాజ్ గా రికార్డులు ఎప్పుడు బద్దలు కొట్టడం ఖాయమే.

రైతు పండుగ :నేడు రేవంత్ చెప్పనున్న ఆ రెండు శుభవార్తలు ఏంటి ? 
Advertisement

తాజా వార్తలు