టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి( Director SS Rajamouli ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు సినిమా ఇండస్ట్రీలో అపజయం ఎరుగని దర్శకుడుగా దూసుకుపోతున్నారు.
బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి.ఆ తర్వాత విడుదల అయినా ఆర్ఆర్ఆర్ సినిమాత తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పారు.
ప్రపంచదేశాల సినీ అభిమానులు ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఎలాంటి నీరాజనాలు పట్టారో మనందరికి తెలిసిందే.ఇప్పుడు జక్కన్న( Jakkana ) సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ ప్రాజెక్టు తెరకెక్కించేందుకు సిద్ధంగాగా ఉన్నారు.

ఇది ఇలా ఉంటే బాలీవుడ్ లో భారీ చిత్రాల నిర్మాత కరణ్ జోహార్( Produced by Karan Johar ) కి రాజమౌళితో మంచి అనుబంధం ఉందన్న సంగతి మనందరికి తెలిసిందే.కాగా రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రాన్ని కరణ్ జోహార్ హిందీలో తన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రిలీజ్ చేశారు.అలాగే ఆర్ఆర్ఆర్( RRR ) చిత్ర హిందీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కరణ్ జోహార్ హోస్ట్ గా చేశారు.తాజాగా కరణ్ జోహార్ రాజమౌళి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఒక ఇంటర్వ్యూలో కరణ్ జోహార్ పాల్గొనగా.యాంకర్ ఆయన్ని ఇండియన్ సినిమాలో గేమ్ ఆఫ్ థ్రోన్స్, అవెంజర్స్( Game of Thrones, Avengers ) లాంటి భారీ ప్రాజెక్ట్స్ ఎందుకు రావడం లేదు ? అలాంటి చిత్రాలు మనం తీయలేమా ? మన దగ్గర అంత బడ్జెట్ లేదా? అని ప్రశ్నించారు.

దీనికి కరణ్ జోహార్ బదులిస్తూ.మన దగ్గర అంత డబ్బు లేక కాదు.కానీ ఇండియాలో ఒక్క రాజమౌళి మాత్రమే ఉన్నాడు అంటూ ప్రశంసలు కురిపించాడు.అవెంజర్స్ లాంటి చిత్రాలు నిర్మించడానికి మనకి బడ్జెట్ సమస్య లేదు.కానీ మనకి రాజమౌళి లాంటి దర్శకులు ఎక్కువమంది కావాలి.అప్పుడే అలాంటి చిత్రాలు ఇండియన్ సినిమాలో ఎక్కువగా వస్తాయి అని తెలిపారు.
కరణ్ జోహార్ లాంటి నిర్మాత రాజమౌళికి అంతటి ప్రాధాన్యత ఇవ్వడం తెలుగు సినిమాకి గర్వకారణం అని చెప్పొచ్చు.







