ప్రభాస్ కల్కి సినిమాలో గెస్ట్ అపిరియన్స్ ఇస్తున్న బాలీవుడ్ హీరో...

ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ( Prabhas ) ఆ తర్వాత చేసిన రాఘవేంద్ర సినిమాతో ప్లాప్ వచ్చినప్పటికి వర్షం సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నాడు.ఇక అప్పటినుంచి వెనుదిరిగి చూడకుండా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు.

 Bollywood Hero Ranveer Singh Giving Guest Appearance In Prabhas Kalki Movie Deta-TeluguStop.com

ఇక వరుస సక్సెస్ లను తన ఖాతాలో వేసుకుంటూ స్టార్ హీరో గా ఎదిగాడు.ఇక బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తాను చాటిన ప్రభాస్ ప్రస్తుతం వరుస గా మంచి సినిమాలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

ఇక ఆయన లాంటి హీరో ఇండస్ట్రీలో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

 Bollywood Hero Ranveer Singh Giving Guest Appearance In Prabhas Kalki Movie Deta-TeluguStop.com
Telugu Bollywood, Nag Ashwin, Kalki, Pan India, Prabhas, Prabhas Kalki, Ranveer

ఎందుకంటే పాన్ ఇండియాలో ఇప్పటివరకు దాదాపు 5 సినిమాలతో 300 కోట్లకు పైన కలెక్షన్లు వసూలు చేసిన ఏకైక హీరోగా కూడా తను నిలవడం అనేది నిజంగా గొప్ప విషయం అనే చెప్పాలి ఇక ఇప్పుడు కల్కి,( Kalki ) రాజసాబ్( Rajasaab ) లాంటి సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు.ఇక ఈ రెండు సినిమాలు అయిపోయిన తర్వాత సందీప్ రెడ్డి డైరెక్షన్ లో స్పిరిట్ అనే సినిమా కూడా చేయబోతున్నాడు.ఇక ఈ సినిమా తర్వాత హను రాఘవ పూడి దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యాడు.

ఇక మొత్తానికైతే తను ఒక రెండు సంవత్సరాలు వరకు ఖాళీగా లేకుండా వరుస సినిమాలు పెట్టుకోనున్నాడు.

Telugu Bollywood, Nag Ashwin, Kalki, Pan India, Prabhas, Prabhas Kalki, Ranveer

అయితే ఈ సినిమాలు రిలీజ్ అయ్యేంతవరకు దాదాపు రెండు సంవత్సరాలు పట్టొచ్చు అని తెలుస్తుంది.ఇక ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్( Nag Ashwin ) డైరెక్షన్ లో వస్తున్న కల్కి సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో ఒక గెస్ట్ పాత్రను పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది.అయితే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉందట.

అది సినిమాకి చాలా ముఖ్యమైనప్పటికీ సినిమాలో ఐదు నిమిషాల పాటు నిడివి తో సాగే పాత్ర కావడం వల్ల దానికి బాలీవుడ్ స్టార్ హీరో అయితే బాగుంటుందనే ఉద్దేశ్యం తో ఆ పాత్ర కోసం రణ్వీర్ సింగ్ ను( Ranveer Singh ) తీసుకున్నట్లుగా తెలుస్తుంది.అతనికి సంబంధించిన టీజర్ ని కూడా తొందర్లోనే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube