రవితేజ, స్నేహ హీరో హీరోయిన్స్ గా నటించిన వెంకి సినిమా( Venky Movie ) మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది.2004లో వచ్చిన ఈ సినిమాకి శ్రీనువైట్ల, గోపి మోహన్ దర్శకులుగా పని చేశారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, అలాగే పాటలు అద్భుతంగా ఉండి సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి.ఇప్పటి వరకు చాలా మంది వెంకి సినిమా గురించి గొప్పగా చెబుతుంటారు.
అందులో రవితేజ( Ravi Teja ) తన స్నేహితులతో ట్రైన్లో చేసే కామెడీ సీన్స్ అయితే అద్భుతంగా ఉంటాయి.ఇప్పటికి అనేక మీమ్స్ కి ఇవే కంటెంట్ గా కూడా ఉన్నాయి.
అప్పట్లో రవితేజ కెరియర్ లో ఇది ఒక బ్లాక్ బాస్టర్ విజయం అనే చెప్పాలి.
అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటి అంటే వెంకి సినిమా తెలుగులోనే నేరుగా వచ్చింది అని అనుకుంటున్నారు.కానీ ఇది మలయాళం లో వచ్చిన నెంబర్ 20 మద్రాస్ మెయిల్( No.20 Madras Mail Movie ) అనే ఒక సినిమాకి రీమేక్ అనే విషయం ఎవరికి తెలీదు.ఈ సినిమాలో మమ్ముట్టి,( Mammootty ) మోహన్ లాల్( Mohanlal ) ఇద్దరు కూడా నటించారు.వెంకి సినిమా రావడానికి దాదాపు 14 ఏళ్ల క్రితం అంటే 1990 లోనే మలయాళం లో ఈ చిత్రం రూపొందడం విశేషం.
అక్కడ విజయవంతమైన సినిమాని తొలుత తెలుగులో సినిమా వచ్చిన ఏడేళ్లకు అంటే 1997లోనే తెలుగులో రీమేక్ చేయాలని భావించారు.
ఈ సినిమాకి రాజశేఖర్, సాక్షి శివానంద్ హీరో హీరోయిన్స్ గా కూడా నటించాల్సి ఉంది, దాదాపు సినిమా 60 శాతం పూర్తి షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ఏవో కొన్ని కారణాల చేత ఆ షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.దానికి అపరిచితుడు అనే ఒక టైటిల్ కూడా ఖరారు చేశారు అప్పట్లో.ఆ తర్వాత 2004లో శ్రీను వైట్ల ఈ చిత్రాన్ని తెరకెక్కించడం, అది విజయం సాధించడం అన్ని జరిగిపోయాయి.
ఇక అపరిచితుడు పేరుతో శంకర్ దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ సినిమా కి డబ్బింగ్ టైటిల్ గా అపరిచితుడు పేరును వాడుకున్నారు.ఇలా 1997లోనే విడుదలవాల్సిన అపరిచితుడు సినిమా అనివార్య కారణాల వల్ల ఆగిపోవడం అదే చిత్రాన్ని వెంకీ చిత్రంగా మళ్ళీ రీమేక్ చేయడం వంటి విశేషాలు గురించి ఇప్పటి యువతకు తెలిసే అవకాశం లేదు.