బాలీవుడ్ నటి షెర్లిన్ చోప్రా( Sherlyn Chopra ) గురించి మనందరికీ తెలిసిందే.షెర్లిన్ చోప్రా సినిమాల ద్వారా కంటే కాంట్రవర్సీల ద్వారా ఎక్కువగా పాపులారిటీని తెచ్చుకుందని చెప్పవచ్చు.
అంతేకాకుండా ఈమె ఎక్కువగా వివాదాలలో నిలిచి వివాదాస్పద నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.మరి ముఖ్యంగా బాలీవుడ్ నటి శిల్పాశెట్టి( Actress Shilpa Shetty ) భర్త రాజ్ కుంద్రా( Raj Kundra ) కేసు విషయంలో నటి రాఖీ సావంత్ ( Rakhi Sawant )తో పాటు ఈమె పేరు కూడా సోషల్ మీడియాలో మార్మోగిన సంగతి మన అందరికీ తెలిసిందే.
కాగా ఈమె బాలీవుడ్ లో దోస్తీ: ఫ్రెండ్స్ ఫరెవర్, రెడ్ స్వస్తిక్, వజా తుమ్ హో లాంటి సినిమాలలో నటించి బాలీవుడ్‌లో మంచి గుర్తింపును ఏర్పరుచుకుంది.

అయితే రెండు దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఈమెకు సరైన అవకాశాలు రాలేదు.దాంతో ఈమె కొన్ని అడల్ట్ కంటెంట్ సినిమాల్లో ఎక్కువగా నటించి పాపులారిటీ సంపాదించుకుంది.ఎక్కువగా బోల్డ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.
అలాగే పోర్నోగ్రఫీ కేసు, డ్రగ్స్ కేస్ విషయంపై బాలీవుడ్ స్టార్స్ పై రకరకాల విమర్శలు చేసి ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ వచ్చింది.ఇది ఇలా ఉంటే తాజాగా ఆమె మరో వివాదంలో చిక్కుకుంది.
ఆమె ఒకటి ఫైనాన్షియర్ చేతుల్లో చిక్కుకుంది.

నటి షెర్లిన్ చోప్రాకు ఒక ఫైనాన్షియర్ నుంచి వేధింపులు ఎదురయ్యాయి.తనను వేధిస్తున్నాడు అంటూ సదరు వ్యక్తిపై షెర్లిన్ చోప్రా ముంబై పోలీసులకు కంప్లైయింట్ చేసింది.ఒక వీడియో రికార్డింగ్ విషయంలో తనను ఫైనాన్షియర్ వేధిస్తున్నాడని, చంపేస్తాను అంటూ బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
సదరు ఫైనాన్షియర్ తో వీడియో రికార్డింగ్ కు తాను ఒప్పుకున్నానని, కానీ అనివార్య కారణాల వల్ల వీడియో షూటింగ్ లో పాల్గొనలేక పోతున్నానని అంటోంది షెర్లిన్ చోప్రా.ప్రస్తుతం ఈ విషయం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.







