ఇటీవల కాలంలో తెలుగు బుల్లితెర అలాగే వెండితెర పైకి రీఎంట్రీ ఇవ్వడానికి ఒకప్పటి నటీనటులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.80-90ల కాలంలో నటులు అందరూ కూడా సెకండ్ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే చాలామంది సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి
బుల్లితెరపై
దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఇప్పటికే కస్తూరి, అర్చన, రాధ, నదియా,ఇంద్రజ,మీనా, రాశి, సిమ్రాన్, ప్రేమ, జ్యోతిక, సంఘవి లతో పాటుగా ఇంకా చాలామంది నటీమణులు మళ్లీ బుల్లితెర పైకి రీఎంట్రీ ఇవ్వడానికి బిజీ బిజీ అవ్వడానికి తెగ ప్రయత్నిస్తున్నారు.

అయితే హీరోలతో పోల్చుకుంటే హీరోయిన్ల జాబితానే చాలా పెద్దదని చెప్పవచ్చు.అటువంటి వారిలో నటీమణులు మీనా, ప్రీతా, సంఘవి, సంగీత, మహేశ్వరిలు ఎప్పటికప్పుడు కలుసుకుంటూనే ఉంటారు.ఈ నేపథ్యంలోనే ఇటీవల ఒక కార్యక్రమంలో భాగంగా వీరందరూ కలుసుకున్నారు.తాజాగా ఒక టీవీ కార్యక్రమంలో పాల్గొన్న సంఘవి( Sanghavi ) ప్రముఖ నటుడు, విలన్ బబ్లూ పృధ్వీ రాజ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
పృధ్వీ రాజ్ ( Prithvi Raj ) తనను మోసం చేశారు ఆమె తెలిపింది.అతను చేసిన మోసం త్వరగా తెలిసిపోయిందని చెప్పారు.ఇంతకీ ఏం జరిగిందంటే.

తాజాగా క్యాష్ ప్రొగ్రామ్‌కు వచ్చారు సంఘవి, మహేశ్వరి, ఫృధ్వీ, ఆకాష్‌లు.ఈ సందర్భంగా పృధ్వీ తనను చేసిన మోసం గురించి సంఘవి బయటపెట్టారు.ఒక రోజు షూటింగ్ ముగించుకుని రాత్రి వస్తున్నాను.అంతలో పృధ్వీ వచ్చి నా వైఫ్ ప్రెగ్నెంట్.వీళ్లు కేక్ అడిగితే ఇవ్వడం లేదు అన్నాడు.నేను చాలా సీరియస్‌గా రెస్టారెంట్‌కు వెళ్లి పోయి కేక్ ప్యాక్ చేయించి ఇచ్చాను.తర్వాత ఎయిర్ పోర్టులో తనని, తన వైఫ్‌ను చూశాను.
వెళ్లి ఎన్నో నెల అని అడిగాను.వాట్ హౌ మనీ మంత్సా అని అడిగింది.
ప్రెగ్నెంట్ కాకపోయినా అబద్దం చెప్పి ఆయన కేక్ తీసుకెళ్లారు అని సంఘవి నవ్వుతూ తెలిపింది.అయితే ఆయన ప్రెగ్నేంటేమో అని మహేశ్వరి( Maheshwari ) అనే సరికి అక్కడున్న వారందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.







