మెగాస్టార్ సినిమా ని వెంటాడుతున్న హీరోయిన్ కష్టాలు..

ప్రస్తుతం తెలుగులో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ "ఆచార్య" అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే.

ఈ చిత్రంలో హీరోగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నాడు.

కాగా ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పై మెగాస్టార్ చిరంజీవి తనయుడు హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నాడు.అయితే ఈ చిత్రానికి సంబందించిన చిత్రీకరణ పనులు ఇప్పటికే మొదలు కాగా దాదాపుగా 45 శాతం చిత్రీకరణ కూడా పూర్తి చేసుకుంది.

కానీ ఇప్పటివరకు ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే హీరోయిన్ విషయంలో మాత్రం ఇప్పటికీ చిత్ర యూనిట్ సభ్యులు సరైన స్పష్టత ఇవ్వడం లేదు.దీంతో ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే హీరోయిన్ విషయంలో  సోషల్ మీడియాలో పలు వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

అయితే ఇటీవల కాలంలో మెగాస్టార్ చిరంజీవి సరసన టాలీవుడ్ కి చెందినటువంటి ఇద్దరు స్టార్ హీరోయిన్లను ఎంపిక చేయగా పలు కారణాల వల్ల హీరోయిన్లు దర్శకుడికి హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.దీంతో ఈ చిత్రంలో నటించే హీరోయిన్ విషయంలో రోజుకో కొత్త పేరు వినిపిస్తోంది.

Advertisement

ఇలా ఇప్పటివరకు దాదాపుగా టాలీవుడ్లోని అనుష్క, కాజల్, శృతి హాసన్, త్రిష తదితర స్టార్ హీరోయిన్ల పేర్లు బలంగా వినిపించినప్పటికీ చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం ఈ విషయంపై స్పందించడం లేదు.అయితే తాజాగా ఈ చిత్రంలో చిరంజీవి కి జోడీగా బాలీవుడ్ భామ విద్యాబాలన్ నటిస్తున్నట్లు పలు వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.

మరి కనీసం ఈ వార్తలపై అయినా దర్శకుడు కొరటాల శివ స్పందిస్తాడో చూడాలి.ఈ విషయం ఇలా ఉండగా మరో పక్క ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే హీరోయిన్ ఎవరో తెలుసుకోవడానికి మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రానికి సంబంధించి చిత్రీకరణ పనులను కొంతకాలం పాటు తాత్కాలికంగా వాయిదా వేశారు.అయితే తమిళంలో మంచి విజయం సాధించినటువంటి "లూసిఫర్" అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆసక్తి కనబరుస్తున్నాడట.

అంతేగాక ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం టాలీవుడ్ దర్శకుడు సుజిత్ దక్కించుకున్నట్లు సమాచారం.అన్నీ కుదిరితే సెప్టెంబర్ నెలలో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు చిరు సన్నాహాలు చేస్తున్నాడట.

రామ్ చరణ్ సుకుమార్ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న ఐటెం బ్యూటీ...
Advertisement

తాజా వార్తలు