అవకాశాల కోసం అందాలు ఆరబోస్తున్న సీరియల్ హీరోయిన్... కానీ

తెలుగులో యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా నటించిన  "జాదూగాడు" అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకి హీరోయిన్ గా పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ సొనారిక భండోరియ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

అయితే ఈ అమ్మడు వచ్చీ రావడంతోనే అడపాదడపా సినిమాలతో బాగానే పర్వాలేదనిపించినప్పటికీ ఈ అమ్మడికి   ఇప్పటివరకూ తెలుగు సినిమా పరిశ్రమలో చెప్పుకోవడానికి సరైన హిట్ లేక పోవడంతో గుర్తింపుకి నోచుకోని లేకపోయింది అంతేకాక అవకాశాలను కూడా పెద్దగా దక్కించుకోలేక పోయింది.దీంతో ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు పలు రకాల ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న ఫోటోషూట్ కార్యక్రమాల్లో పాల్గొంటూ తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తూ కుర్రకారులో హీట్ పెంచేస్తోంది. అంతేగాక ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాల కోసం కొంత మేర గ్లామర్ డోసు కూడా పెంచింది.

అలాగే తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే కచ్చితంగా బోల్డ్ తరహా పాత్రలో అయినా సరే నటించేందుకు సిద్ధమేనంటూ దర్శక నిర్మాతలకి సిగ్నల్స్ పంపుతోంది.తెలుగులో ఈ అమ్మడు నటించినటువంటి జాదూగాడు, ఈడో రకం ఆడో రకం, స్పీడున్నోడు, తదితర చిత్రాలు బాక్సాఫీసు వద్ద పెద్దగా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయాయి.

 దీంతో ప్రస్తుతం పలు బాలీవుడ్ లోని పలు ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది. అంతే గాక పలు చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించేందుకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

చంద్రకాంత్ మరణం పై నటుడు నరేష్ షాకింగ్ కామెంట్స్.. నా పరిస్థితి అదేనంటూ?

తాజా వార్తలు