15 ఏళ్ల క్రితం శిల్పా శెట్టి జీవితంలో ఏం జరిగింది.. ఇంతకాలనికి ఆమె బయటపడటమేంటి?

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఎన్నో చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు.

అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న శిల్పా శెట్టి గత కొద్ది రోజుల నుంచి పెద్దఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు.అందుకు గల కారణం ఈమె భర్త రాజ్ కుంద్రా ఫోర్న్ కంటెంట్ చిత్రాలను తీయడమే అని అతనిని పోలీసులు అరెస్టు చేశారు.

దీంతో శిల్పా శెట్టి గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు నిలుస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా శిల్పాశెట్టి జీవితంలో దాదాపు 15 సంవత్సరాలు జరిగిన ఓ సంఘటనలో భాగంగా ఆమె పై పోలీసు కేసు నమోదయ్యింది.

ఈ క్రమంలోనే 15 సంవత్సరాలకు ఆమెకు ఆ కేసు నుంచి విముక్తి కలిగినట్లు న్యాయస్థానం తీర్పు వెల్లడించారు.అసలు 15 సంవత్సరాల క్రితం శిల్పాశెట్టి జీవితంలో ఏం జరిగింది అనే విషయానికి వస్తే.

Advertisement

శిల్పా శెట్టి హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ 2007 ఏప్రిల్ 15వ తేదీన రాజస్థాన్ లో ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు సెలెబ్రెటీలతో కలిసి ఓ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా శిల్పాశెట్టి హాలీవుడ్ నటుడు రిచర్డ్ పరస్పరం ఒకరినొకరు కౌగలించుకొని ముద్దులు పెట్టుకోవటంతో వీరి వ్యవహారశైలిపై అనేక నగరాలలో నిరసనలు వ్యక్తమయ్యాయి.ఈ క్రమంలోనే ఏప్రిల్ 26 2007 రాజస్థాన్ న్యాయస్థానం శిల్పా, గేర్‌ అరెస్టుకు వారింటి జారీ చేయడంతో సుప్రీం కోర్టు ఇద్దరు న్యాయమూర్తులు బెంచ్ అరెస్ట్ వారెంట్ లను సస్పెండ్ చేశారు.అయితే ఈ ఘటన జరిగిన 15 సంవత్సరాలకు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కేతకి చవాన్ ఈ కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆరోజు శిల్పాశెట్టి పై జరిగిన ఆరోపణలలో ఏ మాత్రం నిజం లేదని ఈ సంఘటన జరిగిన కొంత సమయానికి శిల్పా శెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ కేసును సుప్రీంకోర్టుకుబదిలీ చేయాలని పిటిషన్ దాఖలు చేయడంతో 2017వ సంవత్సరంలో ఈ కేసు సుప్రీం కోర్టుకు వెళ్లింది.ఈ క్రమంలోనే ఈ కేసుపై స్పందించిన కోర్టు ఈ కేసులో ఎలాంటి ఆరోపణలు లేవని అదేవిధంగా ఈమె పై వచ్చిన ఏ ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనవని పేర్కొంటూ ఈ కేసును కొట్టివేశారు.ఇలా 15 సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘటనకు నేడు ముగింపు పలకడంతో శిల్పశెట్టి హర్షం వ్యక్తం చేశారు.

హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
Advertisement
" autoplay>

తాజా వార్తలు