స్త్రీల కంటే పురుషులే సురక్షితంగా ఉన్నారు.. వైరల్ అవుతున్న కంగనా సంచలన వ్యాఖ్యలు!

తెలుగు సినీ ప్రేక్షకులకు బాలీవుడ్( Bollywood ) ఫైర్ బ్రాండ్ నటి కంగనా రనౌత్( Kangana Ranauth ) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఈమె బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

కాగా కంగనా రనౌత్ సినిమాల ద్వారా కంటే ఎక్కువగా కాంట్రవర్సీల ద్వారా హైలెట్ అయింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.తరచూ ఈమె ఎక్కువగా కాంట్రవర్సీలకు సంబంధించిన విషయాలలోనే వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

అలాగే సోషల్ మీడియాలో జరిగే పలు అంశాలపై కూడా తనదైన శైలిలో స్పందిస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో మరో షాకింగ్ పోస్ట్ చేసింది కంగనా.

అసలేం జరిగిందంటే.కొద్ది రోజుల క్రితం నటి నీనా గుప్తా ( Actress Neena Gupta )స్త్రీవాదం పై తనదైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ.పురుషులు, స్త్రీలు ఎప్పటికీ సమానంగా ఉండలేరు.

Advertisement

పురుషుడు కూడా గర్భం దాల్చితే అప్పుడు స్త్రీ, పురుషులు సమానమే.అని నీనా గుప్తా తెలిపింది.

అయితే ఆమె ప్రకటనపై పలువురు నిరసన వ్యక్తం చేశారు.చాలా మంది నీనా గుప్తాను ట్రోల్ చేశారు.

తాజాగా నటి కంగనా మాత్రం నీనా గుప్తా కామెంట్స్ పై స్పందించింది.పురుషులు, మహిళల గురించి ఒక పోస్ట్ ను షేర్ చేసింది.

నీనా గుప్తా ప్రకటనపై అందరూ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారంటే.ఇటీవల నీనా మాట్లాడుతూ.

కీళ్ల నొప్పుల నుంచి మ‌ల‌బ‌ద్ధ‌కం నివార‌ణ వ‌ర‌కు ఆముదంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?
అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...

స్త్రీ పురుషులు ఎప్పటికీ సమానం కాలేరు.స్త్రీ వేరు,పురుషులు వేరు కాదా? పురుషులు, మహిళలు మాత్రమే కాదు, మనలో ప్రతి ఒక్కరూ భిన్నంగా ఉంటారు.

Advertisement

కాబట్టి దేవుడే కాదు, గురువు, పెద్దలు, తల్లి, తండ్రి, అందరూ బిన్నంగా ఉంటారు.కొందరికి ఎక్కువ అనుభవం ఉంది.మరికొందరు ఎక్కువ అభివృద్ధి చెందారు.

కానీ మనం ఏ స్థాయిలోనూ సమానం కాదు అని అంది.అలాగే ఆడవాళ్లకు మగవాళ్ళు కావాలా? ఖచ్చితంగా, మహిళలకు పురుషులు ఎంత అవసరమో, పురుషులకు కూడా మహిళలు అవసరం.మా అమ్మ తన జీవితాన్ని ఒంటరిగా గడపవలసి వస్తే, ఆమె జీవితంలో చాలా కష్టాలు ఉండేవి అని చెప్పుకొచ్చింది నీనా గుప్తా.

దీని పై కంగనా స్పందిస్తూ.మా అమ్మ లేకుండా నాన్న కూడా ఉండలేరు.ఇందులో అవమానం ఏంటో నాకు అర్థం కావడం లేదు.

పురుషులకు నెలలో ఏడు రోజులు రక్తస్రావం జరగదు.వారికి దైవిక శక్తి లేదు.

ఈరోజు స్త్రీల కంటే పురుషులే సురక్షితంగా ఉన్నారు.ముఖ్యంగా యువతులకు ఇది అంత ఈజీ కాదు అని కంగనా రనౌత్ కూడా తన పోస్ట్ లో రాసుకొచ్చింది.

తాజా వార్తలు