సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ( Casting couch )అన్న పదం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది.సినిమా ఇండస్ట్రీ తో పాటు అన్ని రంగాల్లో ఉన్నప్పటికీ ఎక్కువగా సినిమా ఇండస్ట్రీలోనే వినిపిస్తూ ఉంటుంది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న వారు ఒకానొక సమయంలో ఏదో ఒక సందర్భంలో కాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొన్న వారే.ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది సీనియర్ హీరోయిన్లు యంగ్ హీరోయిన్లు వారికి ఎదురైన చేదు సంఘటనల గురించి క్యాస్టింగ్ కౌచ్ అనుభవాల గురించి నోరు మెదిపిన సంగతి తెలిసిందే.
మరికొందరు మాత్రం వారికి జరిగిన చేదు అనుభవాల గురించి బయటకు వెల్లడించలేక వారిలో వారికి కూలిపోతూ ఉంటారు.కేవలం నటీమణులు మాత్రమే కాకుండా హీరోలు నటులు కూడా ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ని ఎదుర్కొన్నారు.ఇప్పటికే ఎంతోమంది నటులు వారికి ఎదురైన చేదు అనుభవాలను చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.కేవలం ఆడవారికీ మాత్రమే కాకుండా మగవారికీ కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదురవుతూనే ఉంటాయి.
తాజాగా ఒక నటుడు తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితుడినే అని చెబుతూ ఉన్న విషయాలను వెల్లడించారు.
ఆ నటుడు మరెవరో కాదు బాలీవుడ్ నటుడు శివఠాక్రే( Siva thakre ).ఇతను బిగ్ బాస్( Big Boss ) హౌస్కి ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకున్న విషయం తెలిసిందే.బిగ్ బాస్ తో వచ్చిన గుర్తింపుతో ఇప్పుడిప్పుడే అవకాశాలను అందుకుంటున్నాడు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న శివఠాక్రే ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.బాలీవుడ్( Bollywood ) లో అమ్మాయి లకే కాదు అబ్బాయిలకు కూడా సమస్యలు ఉంటాయని నాకు అర్థం అయింది.
ఒకసారి నేను ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఒక డైరెక్టర్ ఆడిషన్ అయిన తర్వాత మసాజ్ సెంటర్ కి రా నీతో పని ఉంది అని చెప్పాడు.నాకు అలాంటి పని చేయడం ఇష్టం లేదు అందుకే నేను అక్కడి నుంచి వచ్చేసాను అని తెలిపాడు శివఠాక్రే.
ఆ తర్వాత మళ్లీ సినిమా రంగంలో ఛాన్స్ ల కోసం కష్టపడుతుంటే ఒక మహిళ అర్ధరాత్రి 11 గంటలకు నన్ను ఆడిషన్ రమ్మంది.తన బిల్డింగ్ కీ ఆడిషన్ కీ రమ్మని చెప్పింది.
తను చాలా మందిని స్టార్స్ చేసిందని,నేను కూడా వస్తే నన్ను కూడా స్టార్ చేస్తానంది.తాను చెప్పేది నాకు అర్థం అయ్యి నేను సీరియస్ గా రానని చెప్పడంతో నీకు ఇండస్ట్రీలో పని చేయాలనీ లేదా? నువ్వు రాత్రికీ రాత్రే నీకు పని దొరకదు అని ఆమె వార్నింగ్ ఇచ్చింది.అయినా నేను వెళ్ళలేదు అని చెప్పుకొచ్చాడు శివఠాక్రే.