అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.5 నుండి 10 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు అయితే గొప్ప విషయం అని ఉత్తర భారతం లో విడుదల చేయగా పుష్ప సినిమా ఏకంగా రూ.100 కోట్ల కు పైగా కలెక్షన్స్ రాబట్టి ప్రతి ఒక్కరిని ఆశ్చర్య పరిచింది.జీరో పబ్లిసిటీ ఖర్చు తో పుష్ప సినిమా ఉత్తర భారతంలో విడుదల చేయడం జరిగింది.అయినా కూడా మౌత్ టాక్ తో పుష్ప సినిమా రూ.100 కోట్ల కు పైగా కలెక్షన్స్ నమోదు చేసుకుని ప్రతి ఒక్కరిని ఆశ్చర్య పరిచింది.అందుకే పుష్ప సీక్వెల్ పై మరింతగా ప్రేక్షకులకు అంచనాలు ఉంటాయని ఉద్దేశంతో దర్శకుడు సుకుమార్ భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నాడు.

ఉత్తర భారతం లో పుష్ప 2 యొక్క కలెక్షన్స్ రూ.500 కోట్ల కు పైగా ఉండాలని దర్శక నిర్మాతలు చాలా పట్టుదలతో ఉన్నట్లుగా తెలుస్తుంది.అందుకే బాలీవుడ్ స్టార్స్ ని ఈ సినిమా లో నటింపజేస్తున్నారట.
బాలీవుడ్ ముద్దుగుమ్మ ఒకరు ఈ సినిమా కోసం ఐటెం సాంగ్ చేసేందుకు ఓకే చెప్పారట.తాజాగా అనుకున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మూడు లేదా ఐదు రోజుల పాటు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ డేట్లు కేటాయించేందుకు ఓకే చెప్పాడని.

ఆయన ఈ సినిమా లో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడని కూడా సమాచారం అందుతుంది.మొత్తానికి పుష్ప 2 యొక్క అంచనాల ఆకాశాన్ని తాకేలా చేస్తున్నారు అనడంలో సందేహం లేదు.అల్లు అర్జున్ పుష్ప సినిమా లో విభిన్నమైన గెటప్ లో కనిపించి హిందీ సినీ ప్రేమికులను అలరించాడు.కనుక పుష్ప 2 లో కూడా అదే విధంగా కనిపించే అవకాశాలు ఉన్నాయి.
అంతే కాకుండా పుష్ప సినిమా కు అద్భుతమైన సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ పుష్ప 2 కు రిపీట్ అవుతున్నాడు.







