చ‌రిత్ర‌కెక్కిన ఫ్యామిలీ యువ‌కెర‌టం పొలిటిక‌ల్ ఎంట్రీ.... ఏలూరు ఎంపీ రేసులో ' బోళ్ల రాజీవ్‌ '   Bolla Rajiv Political Entry     2018-04-10   00:22:09  IST  Bhanu C

ఎవ‌రు కాద‌న్నా.. అవున‌న్నాకొన్ని కుటుంబాలకు చెందిన నేత‌ల‌కు రాజ‌కీయంగా ఉండే ప‌లుకుబ‌డి ప్ర‌తిష్ఠ‌, విశ్వ‌స‌నీయత అక్క‌డి ప్ర‌జల్లో బ‌ల‌మైన ప్ర‌భావం చూపిస్తాయ‌న్న‌ది నిజం. తెలుగుదేశం పార్టీకి పెట్ట‌ని కోట‌గా చెప్పుకునే ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో అలాంటి నేప‌థ్య‌మున్న కుటుంబ‌మే.. దివంగ‌త నేత, మాజీ కేంద్ర‌మంత్రి బోళ్ల బులిరామ‌య్యది. జిల్లాలో ప్ర‌ముఖ పారిశ్రామిక‌, రాజ‌కీయ కుటుంబాలైన‌ పెండ్యాల వారితోను, ముళ్ల‌పూడి హ‌రిశ్చంద్రప్ర‌సాద్‌, అల్లూరి బాపినీడు కుటుంబంతోను ఆయ‌న‌కు ద‌గ్గ‌ర బంధుత్వ‌ముంది. వీరికి తెలుగు రాజ‌కీయ చ‌రిత్ర పుట‌ల్లో ఎంతో స్థానం ఉంది.


దిగ్గ‌జ పారిశ్రామిక సంస్థ ఆంధ్రా సుగ‌ర్స్ ప్ర‌గ‌తి ప్ర‌స్థానంలో.. అది శాఖోప‌శాఖ‌లుగా విస్త‌రించ‌డంలో దివంగ‌త ముళ్లపూడి హ‌రిశ్చంద్ర‌ప్ర‌సాద్‌తో స‌మాన‌మైన పాత్ర బుల్లిరామ‌య్య‌ది. అంతేకాదు నాలుగుసార్లు ఏలూరు లోక్ స‌భ స‌భ్యుడిగా, ఒక‌సారి కేంద్ర‌మంత్రిగా అవినీతి మ‌కిలి ఇసుమంతైనా అంట‌ని నాయ‌కుడిగా బుల్లిరామయ్య ప్ర‌జ‌ల్లో గౌర‌వ ప్ర‌తిష్ఠ‌లు సంపాదించుకున్నారు. కీల‌క స‌మ‌యాల్లో పార్టీ అధినేత చంద్ర‌బాబుకు ఆయ‌న అండ‌దండ‌గా ఉంటూ వ‌చ్చారు. కాగా జిల్లాలో ఇపుడు ఆయ‌న రాజ‌కీయ వార‌సుడిగా ఆయ‌న మ‌నుమ‌డు బోళ్ల రాజీవ్ రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేయ‌బోతుండ‌టం టీడీపీ క్యాడ‌ర్‌లో మ‌రింత ఆనందోత్సాహాల‌ను నింపుతోంద‌ని చెప్పాలి. 2019 ఎన్నిక‌ల్లో ఏలూరు టీడీపీ ఎంపీ అభ్య‌ర్థిగా బోళ్ల రాజీవ్ పేరు జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ‌కు వ‌స్తోంది.

బ‌ల‌మైన రాజ‌కీయ, పారిశ్రామిక నేప‌థ్య‌మున్న బోళ్ల రాజీవ్‌కు గ‌త ఎన్నిక‌ల్లోనే చంద్ర‌బాబు జిల్లాలో ఓ అసెంబ్లీ సీటు ఆఫ‌ర్ చేశారు. అయితే నాడు బుల్లి రామ‌య్య‌తో పాటు రాజీవ్ ఇద్ద‌రూ ఎంపీ సీటుకే ప‌ట్టుబ‌ట్టారు. ఇక ఇప్పుడు ఎన్నిక‌ల హీట్ స్టార్ట్ అవ్వ‌డంతో రాజీవ్ ఎంపీ అభ్య‌ర్థిత్వంపై చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌డంతో పాటు ఆయ‌న కూడా రాజ‌కీయ రంగంలోకి దిగారు. కేంద్రంలోని బీజేపీతో రాజ‌కీయ వైరం ఏర్ప‌డిన నేప‌థ్యంలో…2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని మొత్తం ఎంపీ సీట్లు గెలుచుకోవ‌డం ద్వారా బీజేపీకి గుణ‌పాఠం నేర్పి, రాష్ట్ర ప్ర‌యోజ‌నాలు నెరవేర్చుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు అడుగులు వేస్తున్నారు. ఈ చాణ‌క్యంలో భాగంగానే ఎంపీ స్థానాల‌కు దీటైన అభ్య‌ర్థులను ఎంపిక చేసే ప్ర‌క్రియ ఇప్ప‌టికే మొద‌లుపెట్టారు. ఒక వ‌చ్చే ఎన్నిక‌ల్లో యువ‌త‌కు టీడీపీలో భారీ ప్ర‌యారిటీ ఉండ‌నుంది.

రాజీవ్ ఆస్ట్రేలియాలో ఏంబీఏలో మాస్ట‌ర్స్ చేశారు. మూడున్న‌ర ప‌దుల వ‌య‌స్సులోనే యువ పారిశ్రామిక‌వేత్త‌గా రాణిస్తున్నారు. ఇక ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన పారిశ్రామిక వార‌స‌త్వాన్ని స‌క్సెస్ ఫుల్‌గా కంటిన్యూ చేస్తూనే ఇప్పుడు అదే బాట‌లో పొలిటిక‌ల్ ఎంట్రీ ఇస్తున్నారు. తాత బాట‌లోనే నేరుగా లోక్‌స‌భ‌కే పోటీకి రెడీ అవుతున్నారు. ఇప్ప‌టికే తాత బాట‌లో యువ పారిశ్రామిక‌వేత్త‌గా తానేంటో నిరూపించుకున్న రాజీవ్ మ‌రి రాజ‌కీయాల్లో ఎలా రాణిస్తారో ? అన్న‌ది ఆస‌క్తిగా మారింది.