ఇటీవల కెనడాలో( Canada ) జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పంజాబ్( Punjab ) యువకుడి మృతదేహం ఆదివారం స్వదేశానికి చేరుకుంది.ఫాజిల్కాకు చెందిన దిల్‌ప్రీత్ సింగ్ గ్రేవాల్( Dilpreet Singh Grewal ) మృతదేహాన్ని పంజాబ్ ప్రభుత్వం సహాయంతో నిన్న అమృత్‌సర్‌లోని గురు రామ్ దాస్ జీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చారు.
గ్రేవాల్ భౌతికకాయాన్ని అందుకోవడానికి పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్‌దీప్ సింగ్ ధాలివాల్( Minister Kuldeep Singh Dhaliwal ) అధికారులతో కలిసి ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.ఉజ్వల భవిష్యత్తు కోసం విదేశాలకు వెళ్లిన యువత ఊహించని ప్రమాదాల బారినపడి కుటుంబ సభ్యులకు తీరని దు:ఖాన్ని మిగులుస్తున్నారని ధాలివాల్ ఆవేదన వ్యక్తం చేశారు.దిల్‌ప్రీత్ సింగ్ కుటుంబ సభ్యులు తనను సంప్రదించగా.తాను ఈ విషయాన్ని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ దృష్టికి తీసుకెళ్లినట్లు కుల్‌దీప్ సింగ్ ధాలివాల్ తెలిపారు.

కాగా.ఈ నెల ప్రారంభంలో కెనడాలోని వాంకోవర్‌లో( Vancouver ) జరిగిన రోడ్డు ప్రమాదంలో దిల్‌ప్రీత్ సింగ్ గ్రేవాల్ ప్రాణాలు కోల్పోయాడు.గ్రేవాల్ అతని కుటుంబానికి ఏకైక జీవనాధారం.అతని ఆకస్మిక మరణంతో తల్లిదండ్రులు, ఇద్దరు సోదరుల జీవితాలను తలక్రిందులు చేసింది.2015లో కెనడాకు వెళ్లిన గ్రేవాల్ బర్నాబీలోని అలెగ్జాండర్ కాలేజీలో( Alexander College ) చేరాడు.గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత కొంతకాలం నిర్మాణ రంగంలో పనిచేసిన గ్రేవాల్.
కోవిడ్ మహమ్మారి కారణంగా ఉబెర్ డ్రైవర్‌గా( Uber Driver ) మారాడు.ఇక్కడ ఎంతో శ్రమించి పదవీ విరమణ చేసిన తల్లిదండ్రులకు తన ఇద్దరు తమ్ముళ్ల చదువుకు గ్రేవాల్ ఆసరాగా నిలిచాడు.
ఈ పరిస్ధితుల్లో దిల్‌ప్రీత్ సింగ్ మరణంతో ఆయన కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది.

ఇకపోతే.ఎదురుచూపులు ఫలించి కెనడాలో శాశ్వత నివాస హోదా పొందిన ఆనందం క్షణాల వ్యవధిలో ఆవిరైంది.ఆ సంతోషం ఎక్కువసేపు నిలవకుండానే ఓ భారతీయ యువకుడిని మృత్యువు కబళించింది.
వివరాల్లోకి వెళితే.పంజాబ్ రాష్ట్రం తాండా ఉర్మూర్ సమీపంలోని సిక్రి గ్రామానికి చెందిన ఆకాశ్ దీప్ (27) ఐదేళ్ల క్రితం స్టడీ వీసాపై కెనడా వెళ్లాడు.
పర్మినెంట్ రెసిడెన్సీ స్టేటస్ (పీఆర్) పొందాలన్నది అతని కల.ఈ క్రమంలో నిరీక్షణ ఫలించి పీఆర్ పొందాడు.దీంతో ఈ సంతోషాన్ని మిత్రులతో కలిసి పంచుకునేందుకు గాను ఆకాశ్ తన స్నేహితులతో కలిసి అంటారియోలోని పోర్ట్ పెర్రీ సరస్సు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తూ మరణించాడు.రెండు రోజుల ఆపరేషన్ తర్వాత ఆకాశ్ మృతదేహాన్ని సరస్సు నుంచి వెలికి తీశారు పోలీసులు.