వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు.రాజకీయాలు ప్రజల కోసం చేయాలని చెప్పారు.
అంతేకానీ పదవుల కోసం కాదని తెలిపారు.
ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా ఏ నిర్ణయమైనా తీసుకోవాలని ఎమ్మెల్యే చెన్నమనేని వెల్లడించారు.
లేకపోతే ఆత్మాభిమానాలు దెబ్బతింటాయని ఆయన పేర్కొన్నారు.అయితే మరికాసేపటిలో బీఆర్ఎస్ అభ్యర్థుల తొలి జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించనున్న నేపథ్యంలో చెన్నమనేని చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
కాగా ఈ జాబితాలో 96 స్థానాల అభ్యర్థుల పేర్లను సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే.







