సింగపూర్‌లో( Singapore ) భవనం కుప్పకూలిన ఘటనలో ఓ భారతీయ కార్మికుడు( Indian Worker ) దుర్మణం పాలయ్యాడు.దాదాపు 8 గంటల పాటు జరిగిన శిథిలాల తొలగింపు కార్యక్రమం తర్వాత అతని మృతదేహాన్ని సహాయక బృందాలు వెలికితీశాయి.
సింగపూర్‌లోని సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో( Central Business District ) ఈ ఘటన జరిగింది.మృతుడిని ఐక్ సన్ డెమోలిషన్ అండ్ ఇంజినీరింగ్‌లో( Aik Sun Demolition and Engineering ) పనిచేస్తున్న భారతీయ కార్మికుడిగా గుర్తించారు.
గురువారం టాంజోంగ్ పగర్‌లోని ఫుజి జిరాక్స్ టవర్స్ భవనం( Fuji Xerox Towers Building ) కుల్చివేత పనులు నిర్వహిస్తున్న సమయంలో బిల్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అతను ప్రాణాలు కోల్పోయాడు.
వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు దాదాపు ఎనిమిది గంటల పాటు జరిగిన ఆపరేషన్ తర్వాత భారతీయ కార్మికుడి మృతదేహాన్ని కనుగొన్నారు.అతని శరీరంపై దాదాపు 2 మీటర్ల మేర శిథిలాలు పడిపోయినట్లు ది స్ట్రెయిట్స్ టైమ్స్ నివేదించింది.సహాయక బృందాలు రాళ్లు పగులగొట్టి , శిథిలాలను తవ్వారు.
అయితే కాంక్రీట్ స్లాబ్ కనీసం 50 టన్నులుపైగా బరువు వుండటంతో రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.భారతీయ కార్మికుడిని వెలికితీసే సమయంలో అతనిలో పల్స్ లేదని , శ్వాస కూడా తీసుకోవడం లేదని సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్స్ (ఎస్‌సీడీఎఫ్) ఒక ప్రకటనలో తెలిపింది.రాత్రి 9.45 గంటలకు మృతదేహాన్ని వెలికితీయగా.అతను అక్కడికక్కడే మృతిచెందినట్లు వైద్య సిబ్బంది నిర్ధారించినట్లు పేర్కొంది.
భవనం కుప్పకూలిన విషయం తెలుసుకున్న వెంటనే ఎస్‌సీడీఎఫ్ ఎమర్జెన్సీ వాహనాలను, దాదాపు 70 మంది అధికారులను, రెండు జాగీలాలను ఘటనాస్థలికి తరలించింది.ఫైబర్ ఆప్టిక్ స్కోప్, లైఫ్ డిటెక్టివ్ ఎక్విప్‌మెంట్ వంటి అత్యాధునిక పరికాలను కూడా వినియోగించారు .శిథిలాల కింద మరెవరూ చిక్కుకోలేదని నిర్ధారించడానికి రాత్రంతా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించామని అధికారులు తెలిపారు.సీసీటీవీ ఫుటేజ్ సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించింది.ఈ భవన కూల్చివేత పనులు నిర్వహిస్తున్న సిటీ డెవలప్‌మెంట్స్ లిమిడెట్ (సీడీఎల్) దుర్ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.