వీడియో: ఇదెక్కడి వింత బిర్యానీ.. అవతార్ కలర్‌లా ఉందే..?

భారతదేశంలో బిర్యానీ( Biryani ) కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్ కూడా.దీని పాపులారిటీ చాలా ఎక్కువగా ఉండటం వల్ల 2023లో, ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ( Food Delivery Platform Swiggy )లో ప్రతి సెకనుకు సగటున 2.

5 బిర్యానీలు ఆర్డర్లు అందుకున్నాయి.అంటే దీనిని ప్రజలు ఎంత బాగా ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

ఇంటర్నెట్‌లో ఈ సంప్రదాయ వంటకం గురించి ఎప్పుడూ చర్చలు జరుగుతూనే ఉంటాయి.కొన్ని బిర్యానీ రకాలు ప్రజలను బాగా ఆకట్టుకుంటాయి.

బిర్యానీలో కొత్త రకాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి.ఇటీవల, ఒక కొత్త వెర్షన్ చాలా మంది దృష్టిని ఆకర్షించింది.

Advertisement

అదే బ్లూ కలర్ బియ్యంతో చేసిన వంటకం, దీనిని బటర్‌ఫ్లై ఘీ రైస్( Butterfly Ghee Rice ) అని పిలుస్తారు.

ఈ వినూత్నమైన వంటకాన్ని ప్రముఖ ఫుడ్ వ్లాగర్ ప్రతిమా ప్రధాన్( Food Vlogger Prathima Pradhan ) పరిచయం చేశారు.ఆమె చెప్పిన ప్రకారం ముందుగా శంఖు పువ్వులను ( Butterfly Pea Flowers ) శుభ్రంగా కడగాలి.రెక్కలను కాడల నుంచి వేరు చేసి, కప్పు బియ్యాన్ని కొద్దిసేపు నానబెట్టాలి.

తర్వాత, ఒక కుండ నీటిని మరిగించి, అందులో శంఖు పువ్వుల రెక్కలు వేసి, నీటికి అందమైన బ్లూ కలర్ వచ్చేదాకా బాగా మరిగించాలి.ఇప్పుడు పువ్వులను తీసేసి, నానబెట్టిన బియ్యాన్ని ఈ బ్లూ వాటర్ లో మీడియం ఫ్లేమ్ మీద 20 నిమిషాలు ఉడికించాలి.

బియ్యం ఉడికిన తర్వాత, స్పూన్ నెయ్యి మరియు కొద్దిపాటి ఉప్పు వేసి కలపాలి.

బాలయ్య టాక్ షోకు పోటీగా రానా టాక్ షో.. ఆ ప్రముఖ షోకు హాజరయ్యే గెస్టులు వీళ్లే!
ఈ సంగతి తెలిస్తే, మీరు ఇక పానీపూరి బండివంక కన్నెత్తి కూడా చూడరు!

ఇక, వేరొక కుండలో నెయ్యి వేడి చేసి, అందులో బియ్యపు పులుసు, యాలకులు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిరకాయలు వేసి వేయించాలి.ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు వేయించిన తర్వాత, నీలి బియ్యంతో కలిపి, రుచులు బాగా కలిసేలా కలపాలి.చివరగా, ఈ బ్లూ రైస్ బిర్యానీ( Blue Rice Biryani )ని పెరుగుతో చేసిన రైతాతో కలిపి తినవచ్చు.ఈ రెసిపీ వీడియో 13.3 మిలియన్‌ కంటే ఎక్కువ వ్యూస్ సాధించి ఇంటర్నెట్‌లో తెగ షికారు చేస్తోంది.ఈ వంటకం చూసిన వారు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

కొందరు ఇలాంటి కొత్త వంటకాన్ని ప్రయత్నించడానికి సంకోచిస్తున్నారు, మరికొందరు దాని రంగు చూస్తేనే వాంతులు అవుతున్నట్లు కామెంట్లు చేస్తున్నారు.ఈ వంటకం రంగును చూసి "అవతార్" బిర్యానీ( Avatar Biryani ) అంటూ మరికొంతమంది సరదాగా పేర్లు పెట్టారు.

ఈ వీడియోను మీరు కూడా చూసేయండి.

తాజా వార్తలు