TDP BJP Aliance : పొత్తుకు బీజేపీ గ్రీన్ సిగ్నల్ .. అసలు విషయమే తేలాల్సి ఉంది 

ఎట్టకేలకు టిడిపి అధినేత చంద్రబాబు,  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) తో నిన్న రాత్రి భేటీ అయ్యారు.చాలాకాలంగా బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు టిడిపి అధినేత చంద్రబాబు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

 Bjps Green Signal For Alliance The Real Thing Needs To Be Revealed-TeluguStop.com

ఎన్డీఏలో చేరేందుకు తాము సిద్ధమని గతంలోని బాబు అమిత్ షా తో చెప్పారు.అయితే బిజెపి అగ్ర నేతలు మాత్రం ఈ పొత్తుల విషయంలో సైలెంట్ గా ఉండడంతో,  బిజెపి తమతో పొత్తు పెట్టుకుంటుందా,  ఒంటరిగా ఎన్నికలకు వెళ్తుందా అనే విషయంలో ఏ క్లారిటీ తెలియక పూర్తిస్థాయిలో జనసేన టిడిపిలో అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో పెట్టింది.

టిడిపి తో పొత్తుల భాగంగా 24 అసెంబ్లీ , మూడు లోక్ సభ స్థానాలను జనసేన( Janasena )కు కేటాయించారు .

Telugu Amit Shah, Ap, Janasena, Janasenani, Pavan Kalyan, Tdp Bjp Aliance, Telug

 బీజేపీతో పొత్తు కుదిరితే ఆ పార్టీకి సీట్లు కేటాయించిన తర్వాత పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించేందుకు టిడిపి జనసేన లు వేచి చూస్తున్నాయి .ఈ నేపథ్యంలోనే పొత్తుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది .అధికారికంగా టిడిపి , జనాసేన ఏ ప్రకటన చేయకపోయినా,  ఈ మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లేననే ప్రచారం జరుగుతుంది.నిన్న రాత్రి 10:30 నుంచి 12 10 వరకు అమిత్ షా తో పవన్,  చంద్రబాబు( Pawan kalyan, Chandrababu )ను చర్చించారు.బిజెపితో పొత్తులో భాగంగా ఆ పార్టీకి నాలుగు ఎంపీ , 6 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వాలనే ఆలోచనతో టిడిపి ఉంది .అంతకంటే ఎక్కువ స్థానాలు ఇస్తే కూటమికి నష్టం జరుగుతుందనే ఆలోచనతో చంద్రబాబు ఉన్నారు.అయితే 10 వరకు లోక్ సభ స్థానాలను బీజేపీ ఆశిస్తోంది.

Telugu Amit Shah, Ap, Janasena, Janasenani, Pavan Kalyan, Tdp Bjp Aliance, Telug

ఈ సీట్ల వ్యవహారంలోనే ఏ క్లారిటీ రాకపోవడంతో మరోసారి ఈ రోజు సీట్ల అంశంపై చర్చించేందుకు భేటీ కాబోతున్నట్లు సమాచారం .మొత్తానికి ఎన్డీఏలు టిడిపి చేరిక దాదాపు ఖాయంగనే కనిపిస్తోంది.బిజెపితో పొత్తు కుదిరితే రాజకీయంగా తమకు ఎంతో కలిసి వస్తుందని , అధికార పార్టీ వైసీపీని ఓడించేందుకు, అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం అండదండలు అన్ని విషయాల్లోనూ తమకు పుష్కలంగా ఉంటాయని,  రాజకీయంగా ఇది తమకు బాగా కలిసి వస్తుందనే లెక్కల్లో టిడిపి అధినేత ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube