ఏపీలో బీజేపీ గేమ్.. ఏ పార్టీ అందుకు ఒప్పుకుంటే ఆ పార్టీతోనే...!!

బీజేపీ ద‌క్ష‌ణాది రాష్ట్రాల‌పై దృష్టి సారించ‌డంతో దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంది.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో మ‌రింత పెంచింది.

 Bjp's Game In Ap If Any Party Agrees To It, It Will Be With That Party.  Bjp, Bj-TeluguStop.com

తెలంగాణ‌లో జోరుమీదున్న బీజేపీ అటు ఏపీలో కూడా బ‌ల‌ప‌డ‌టానికి ప్ర‌య‌త్నిస్తోంది.ఈ క్ర‌మంలోనే సైలెంట్ గా పావులు క‌దుపుతోంది.

ఏ పార్టీ పొత్తుల‌కు ఓకే చెబితే ఆ పార్టీతో దోస్తీ చేయ‌డానికి సిద్దంగా ఉన్న‌ట్లు సంకేతాలు పంపుతోంది.వచ్చే ఎన్నికల్లో పొత్తు రూపేణా ఎక్కువ సీట్లు ఇస్తే వారితోనే ఉండేందుకు మొగ్గు చూపిస్తుందిట.

వచ్చే ఎన్నికల్లో ఏపీలో ముప్పై సీట్లు బీజేపీకి పొత్తుల ద్వారా ఇవ్వాలంట.అలా ఇచ్చిన పార్టీ వైపే బీజేపీ మ‌ద్ద‌తు ఉటుందంట.అయితే బీజేపీకి గ‌త ఎన్నిక‌ల్లో .05 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి.ఒక్క చోట కూడా డిపాజిట్లు రాలేదు.అలాంటి పార్టీ మూడేళ్లలో కూడా పెద్ద‌గా ఏదిగింది ఏమిలేదు.ప్ర‌జ‌ల ప‌క్షాన కోట్లాడింది కూడా ఏమీలేదు.కానీ 2024 ఎన్నికలలో ఏపీలో మాత్రం 30 సీట్లకు పోటీ చేయాలని ఆశపడుతోంద‌ని అంటున్నారు.

అయితే ఈ డిమాండ్ వెనుక బీజేపీ ఓ వ్యూహాన్ని ర‌చిస్తోంద‌ని అంటున్నారు.

కీల‌క వ్య‌వ‌స్థ‌ల‌తో గేమ్

అదేంటంటే.

వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీలు డబ్బులు పంచే కార్య‌క్ర‌మంలో అంటే వివిధ కీలక డిపార్ట్ మెంట్స్ అన్నీ కలసిరావాల్సి ఉంటుంది.అయితే ఆయా వ్యవస్థలు అన్నీ ఇప్పుడు బీజేపీ చేతిలో ఉండడమే క‌లిసి వ‌స్తోంద‌ట‌.

వచ్చే ఎన్నికల్లో పలు డిపార్ట్ మెంట్స్ తో సహా కీలక వ్యవస్థల నుంచి ఏ రకమైన ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే బీజేపీ మెప్పు పొందాల‌న్న‌మాట‌.ఇక మొక్కులు కూడా చెల్లించుకోవాల‌నుకో.

ఇది అస‌లు క‌థ బీజేపీ డిమాండ్ వెన‌క‌.ఇలా బీజేపీ కొండెక్కి పోయి బేరాలు పెడుతోంది అంటే ఏపీలోని ప్రధాన పార్టీల వీక్ నెస్ కూడా బాగా అర్ధమైపోయినందువల్లనే అంటున్నారు.

ఇక ఏపీలో ఇప్పటికే బీజేపీ పొత్తు కోసం ఆరాటపడుతున్న టీడీపీకి కూడా బీజేపీ ఎక్కువ సీట్ల డిమాండే కారణం అంటున్నారు.టీడీపీ ఎక్కువ సీట్లు ఇస్తే కచ్చితంగా తమ సపోర్టు ఆ పార్టీకే ఉంటుంది అని చెబుతారన్నమాట.

Telugu Andhra Pradesh, Ap, Bjp, Telangana-Political

ఇక వైసీపీతో బీజేపీ పొత్తు అన్నది రేపు కనుక అనూహ్యమైన పరిణామాలు జరిగి మెటీరియలైజ్ అయితే వైసీపీ ఎక్కువ సీట్లు బీజేపీకి ఇస్తామని ముందుకు వస్తే అటువైపే మొగ్గు చూపే అవ‌కాశాలూ లేక‌పోలేదంటున్నారు.ఒక విధంగా వైసీపీని తమ వైపునకు తిప్పుకోవాలని బీజేపీ టీడీపీతో పొత్తు అని మైండ్ గేమ్ ఆడుతోంద‌నే అనుమానం కూడా వ్య‌క్తం చేస్తున్నారు.మ‌రో విష‌యం ఏంటంటే.వైసీపీ కనుక పొత్తులకు.ముప్పై దాకా సీట్లు ఇవ్వడానికి దిగిరాకపోతే టీడీపీతో పొత్తులకు తాము రెడీ అవుతామని చెప్పాలని బీజేపీ నేతల మధ్య పెద్ద ఎత్తున చర్చ సాగుతోందిట.తమతో చెలిమి కోసం ఆరాట‌ప‌డుతున్న రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డానికి రాజ‌కీయ చ‌తుర‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తోంద‌ని అంటున్నారు.

ఈ క్ర‌మంలోనే తమ చేతిలో ఉన్న వ్యవస్థలను కూడా యథేచ్చగా వాడుకోవడానికి కూడా సిద్ధపడుతోంద‌ని అంటున్నారు.ఈ ప‌రిణామాలు చూస్తుంటే.

ఒకనాడు వాజ్ పేయ్ అద్వానీ వంటి ప్రముఖులు తీర్చిదిద్దిన బీజేపీ ఈ రకంగా చేయడం అంటే ఆ పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి ఫక్తు రాజకీయం చేస్తోంద‌ని అంటున్నారు.తెలుగు రాష్ట్రాలలో ఎత్తులు చూస్తే ఏమనుకోవాలో తెలియడం లేద‌న్న వారూ లేక‌పోలేదు.

మరి బీజేపీ ప్లాన్లో ఏ పార్టీ ప‌డుతుందో వేచి చూడాల్సిందే…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube