టీడీపీ జనసేన పొత్తు పై బీజేపీ సర్వే ? ఇన్ని సీట్లు గెలవబోతున్నాయా ?

ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి.ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాలు, ప్రతి వ్యూహాలను అమలు చేస్తున్నాయి.

ఇప్పటికే ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి.ఇక పొత్తుల అంశము ఇప్పుడు కీలకంగా మారింది.

ఏపీ అధికార పార్టీ వైసిపి ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటామని ప్రకటించగా, బిజెపితో పొత్తులో ఉన్న జనసేన మాత్రం టిడిపితో పొత్తు పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తోంది.దాదాపు ఈ పొత్తు ఖాయం అయింది.

ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెళ్లిన  సందర్భంగా ఈ పొత్తుల అంశంపై ఒక క్లారిటీ వచ్చిందని,  సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత అధికారికంగా పొత్తు అంశాన్ని ప్రకటించేందుకు రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి.

Advertisement

 అయితే బీజేపీ కూడా తమతో కలిసి వస్తే మరింత బాగుంటుందని జనసేన టిడిపిలు భావిస్తున్నాయి.టిడిపిని ఎట్టి పరిస్థితుల్లో కలుపుకు వెళ్లేందుకు బిజెపి ఇష్టపడడం లేదు.ఈ వ్యవహారం ఇలా ఉంటే జనసేన , టిడిపి లు కలిసి పోటీ చేస్తే ఏపీలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ? ఈ రెండు పార్టీల కూటమి ఎన్ని సీట్లు సాధిస్తాయనే విషయంపై బిజెపి అనుకూలంగా ఉండే ఓ జాతీయ ఛానల్ ఈ సర్వే నిర్వహించిందట. 

 ఈ సర్వేలో టిడిపి జనసేన పొత్తు ప్రభావం ఎక్కువగా ఉంటుందని,  దాదాపు 120 నియోజకవర్గాల్లో సీట్లను గెలుచుకునే అవకాశం ఉంటుందని,  ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు,  ఉత్తరాంధ్ర ప్రాంతం గుంటూరు, ఉమ్మడి కృష్ణ జిల్లా లోను ఈ పొత్తుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందని తేలిందట.అయితే ఈ సర్వే రిపోర్ట్ ను అధికారికంగా ఎవరు ధ్రువీకరించినప్పటికీ ఈ సర్వే నివేదిక పై సోషల్ మీడియాలో మాత్రం జోరుగా ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు