తెలంగాణ బీజేపీకి మరో షాక్ తగిలింది.పార్టీకి రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు.
ముందు నుంచి పార్టీకి సేవ చేసిన వాళ్లకు కాకుండా ఫైరవీలు చేసిన వారికే టికెట్లు ఇచ్చారని రాకేశ్ రెడ్డి తీవ్రంగా పార్టీ తీరుపై మండిపడ్డారు.పొమ్మనలేక పొగ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.
టికెట్ రాలేదని బాధపడుతున్నా రాష్ట్ర నాయకులు కనీసం పట్టించుకోలేదని వాపోయారు.ఈ నేపథ్యంలోనే తన కార్యకర్తలతో కలిసి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
రాకేశ్ రెడ్డి తన భవిష్యత్ కార్యాచరణను 48 గంటల్లో ప్రకటిస్తానని తెలిపారు.వరంగల్ పశ్చిమ టిక్కెట్ దక్కపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.