Fake Flashback Movies: ఈ సినిమాలన్నీ ప్రేక్షకులను ఫూల్స్ చేశాయి.. రజనీకాంత్, ప్రభాస్ సినిమాలు కూడా..

కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరిస్తే.మరికొన్ని సినిమాలు ప్రేక్షకులను గందరగోళంలో పడేస్తాయి.

 Movies Which Are Fooled People Darling Peta Leo Pizza-TeluguStop.com

సినిమాలో మనల్ని ఇన్వాల్వ్ చేసి నిజం అని నమ్మించి. ఆ తర్వాత అదంతా అబద్ధం అని చెబుతారు.

అప్పటివరకు ఇంట్రెస్టింగ్‌గా చూసిన ప్రేక్షకుడు ఏంటి ఇది నిజం కాదా అన్నట్టు మొఖం పెడతాడు.అలాంటి సినిమాలు అన్ని భాషల్లోనూ వస్తాయి.

అలాంటి కొన్ని సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన లియో సినిమా( Leo Movie ) ప్రేక్షకులను కన్ ప్యూచ్ చేస్తోంది.

ఇటీవలే ఈ సినిమా విడుదల అవ్వగా.బాక్సాఫీస్ వద్ద అంతగా కలెక్షన్లను రాబట్టలేదు.తెలుగులో ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకోగా… ఈ సినిమాలో వచ్చిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా నిజం కాదు అని ఒక రూమర్ వినిపిస్తుంది.అసలు విషయం దాచిపెట్టినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి నటించిన పిజ్జా సినిమా( Pizza Movie ) 2012లో విడుదలైంది.ఈ సినిమా కూడా ప్రేక్షకులను పూల్స్ చేసిందని చెప్పవచ్చు.

అప్పటివరకు జరిగిందంతా అబద్ధం అని చెప్పేసరికి ఆడియన్స్ ఒక్కసారిగా షాక్ కు గురవుతారు.

Telugu Flash, Flashback, Khiladi, Leo, Mahesh Babu, Nenokkadine, Prabhas, Rajini

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నేనొక్కడినే సినిమా( Nenokkadine Movie ) కూడా ప్రేక్షకులను పూల్స్ చేస్తుంది.ఇందులో మహేష్ బాబు తల్లిదండ్రులను చంపిన క్యారెక్టర్ గురించి అబద్ధం చెప్పి నమ్మిస్తారు.క్లైమాక్స్ లో అసలు నిజం రివీల్ చేస్తారు.

ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన సినిమా డార్లింగ్( Darling Movie ) కూడా అదే కొవకు చెందినదే.ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ బాగుంటుంది.

సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ లో జరిగిందంతా అబద్ధమని హీరో చెప్పేసరికి ప్రేక్షకులు ఖంగుతింటారు.ఇక యంగ్ హీరో అడివి శేష్ నటించి ఎవరు సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది.

ఈ సినిమాలో అడవిశేష్ ఫ్లాష్ బ్యాక్ నీ వేరే అతనిదిగా చూపించి ఆడియన్స్ ని ఫూల్స్ ని చేశారు.

Telugu Flash, Flashback, Khiladi, Leo, Mahesh Babu, Nenokkadine, Prabhas, Rajini

ఇక రవితేజ హీరోగా నటించిన ఖిలాడి సినిమా( Khiladi Movie ) ప్రేక్షకులను కన్ ప్యూజ్ చేస్తుంది.ఈ సినిమాల్లో జైల్ లో ఉండి రవితేజ చెప్పే కథంతా కూడా ఫేక్ అని ఆ తర్వాత తెలుస్తుంది.ఇక రజనీకాంత్ హీరోగా వచ్చిన పేట సినిమాలో( Petta Movie ) విలన్ గా నటించిన విజయ్ సేతుపతికి రజనీకాంత్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెబుతాడు.

చివరికి ఇది బూటకమని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube