రైతుల పరిహారం ప్రకటనపై బీజేపీ సెటైర్ లు... మరో తప్పు చేస్తోందా?

తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ఢిల్లీలో నూతన వ్యవసాయ చట్టాల రద్దు కొరకు పెద్ద ఎత్తున పోరాటం చేసి అమరులైన రైతు కుటుంబాలకు మూడు లక్షల పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.అయితే కేసీఆర్ చేసిన ఈ ప్రకటనతో పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

 Bjp Satires On Farmers' Compensation Statement ... Making Another Mistake Bjp Te-TeluguStop.com

అయితే ఈ సందర్భంలో బీజేపీ ఈ ప్రకటనపై పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సెటైర్ లు వేస్తోన్న పరిస్థితి ఉంది.అయితే బీజేపీ రైతుల పరిహారం ప్రకటనపై విమర్శించి బీజేపీ మరో తప్పు చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఇక ఇప్పటికే యాసంగి వరి ధాన్యం గురించి తొందరపాటు వ్యాఖ్యలతో బీజేపీ తగిన మూల్యం చెల్లించుకున్న దశలో మరల ఇప్పుడు కూడా నోరు జారితే ఇక బీజేపీ మరింతగా ప్రజల్లో విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంది.అయితే ఈ ప్రకటనపై బీజేపీ ఘాటుగా విమర్శిస్తే దేశ వ్యాప్తంగా రైతుల అగ్రహానికి గురి కావడమే కాకుండా బీజేపీకి దేశ వ్యాప్తంగా మరింత చెడ్డ పేరు తెచ్చే అవకాశం ఉంది.

అయితే తెలంగాణ లో బలపడాలనుకుంటున్న బీజేపీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే రాజకీయంగా చాలా ప్రమాదమని చెప్పుకోవచ్చు.అంతేకాక కెసీఆర్ వ్యూహాలను అర్ధం చేసుకోవాలంటే ప్రస్తుతం ఉన్న బీజేపీ చాలా కష్టపడాల్సి ఉంటుంది.

అంతేకాక ప్రజలకు తాను చేస్తున్న పనుల ద్వారా స్పష్టమైన రీతిలో చెప్పగలిగే సత్తా కలిగిన కెసీఆర్ వ్యూహాలకు చిక్కకూడదు అంటే చాలా జాగ్రత్తగా నాడుచుకోవాల్సి ఉంటుంది.అయితేరైతుల వ్యతిరేకి అని ఒక్క సారి బీజేపీపై ముద్ర పడితే ఇక తెలంగాణలో బీజేపీ ఆముద్ర చెరిపేసుకోవడం చాలా కష్టమైన పని అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఏది ఏమైనా రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాలు మరింత హాట్ హాట్ గా మారే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube