గుజరాత్ ఎన్నికలు తరువాత బాబు కి షాకే

గుజరాత్ ఎన్నికల తర్వాత బిజెపి అధిష్టానం ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టనుందా.? బిజెపి ని బూచిని చేసి పవన్ –చంద్రబాబు ల ద్వయం ఏపీ ప్రజల ఓట్లకోసం డ్రామాలు ఆడుతున్నారని.

త్వరలోనే బిజెపి ఈ నాటకాలకి చెక్ పెట్టనుంది అని తెలుస్తోంది.

పోలవరం విషయం లో జరుగుతున్న అవకతవకల విషయంలో బిజెపి ప్రాజెక్ట్ పనులు నిలిపి వేయాలని ఆదేశించింది కాగ్ నివేదిక కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలిపింది కూడా.అయితే ఈ విషంలో బాబు ప్రజల దృష్టిలో విలన్ అయిపోతాడో అని ఎదురు దాడి చేయడం మొదలు పెట్టింది టిడిపి.

ఆ కోణంలోనే బాబు పవన్ ని రంగంలోకి దింపారు అని వైసీపి ,బిజెపి వాదన.ఇదిలా ఉంటే.బిజెపి పెద్దలు ఇద్దరు.

గుజరాత్ ఎన్నికల్లో బిజీగా ఉన్న సమయంలో ఏపీలోని మిత్రపక్ష నేత చంద్రబాబు ఆయనకు అనుకూలుడని చెప్తున్న పవన్ కళ్యాణ్ ఇద్దరూ కేంద్రంపై , బీజేపీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చంద్రబాబు పోలవరం విషయంలో కేంద్రంతో కయ్యానికి దిగగా .పవన్ ఏపీలో పర్యటిస్తూ బీజేపీ పెద్దలపై.ఆ పార్టీకి కేంద్రమంత్రులు - ఎంపీలపైనా విమర్శలు కురిపిస్తున్నారు.

Advertisement

అయితే.గుజరాత్ ఎన్నికల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా మోదీ - అమిత్ షాలు ఈ విషయం గమనిస్తూనే ఉన్నారని తెలుస్తోంది.

ఇప్పుడు బిజేపి దేశవ్యాప్తంగా బలపడిన నేపథ్యంలో.టీడీపీ-బీజేపీ మధ్య బంధం వచ్చే ఎన్నికల నాటికి ఉంటుందా లేదా అన్న అనుమానంకలుగుతోంది.

ఇప్పటికే చంద్రబాబు బిజెపిని వదిలించుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.అమరావతి పనులు ఊపందుకోకపోవడానికి.

పోలవరం పూర్తికాకపోవడానికి కేంద్రమే కారణం అని చెప్పి.వచ్చే ఎన్నికల్లో ఏపీలో పవన్ కళ్యాణ్ తో జట్టు కట్టేసి అధికారంలోకి రావాలనేది బాబు గారి ప్లాన్ అని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
ఈ దశలో గాజు గ్లాసు గుర్తు మార్చలేం తేల్చి చెప్పిన ఈసీ..!!

ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు అన్నిటిని ఏపీ బిజెపి నేతలు ఎప్పటికప్పుడు మోడీ ,అమిత్ షా లకి చేరవేస్తున్నారు కూడా.అయితే మేము అన్ని విషయాలు తెలుసుకున్తున్నాం గుజరాత్ ఎన్నికల తరువాత ఏపీ పై దృష్టి సారిస్తాం అని ఏపీ నాయకులకి అమిత్ షా చెప్పినట్టుగా తెలుస్తోంది.

Advertisement

మరి బిజెపి ఏపీ లో చంద్రబాబు,పవన్ విషయాలలో ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది అనేది వేచి చూడాల్సిందే.

తాజా వార్తలు