బీజేపీ " రెయిన్ బో " వ్యూహం !

తెలంగాణలో ఎన్నికలు( Telangana Elections ) దగ్గర పడడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలన్నీ మల్లగుల్లాలు పడుతున్నాయి.ఒకవైపు అభ్యర్థుల ఎంపిక చేపడుతూనే మరోవైపు హామీల ప్రకటనపై దృష్టి పెడుతున్నాయి.

 Bjp Rainbow Manifesto With 7 Promises,bjp,rainbow Manifesto ,brs,congress,politi-TeluguStop.com

ఇప్పటికే బి‌ఆర్‌ఎస్ కాంగ్రెస్ పార్టీలు( Congress ) అభ్యర్హ్తులను ఫైనల్ చేసి మేనిఫెస్టోలను కూడా ప్రకటించాయి.ఇక మిగిలింది బీజేపీనే.

కాషాయ పార్టీలో అభ్యర్థుల ఎంపికపై హామీల రూపకల్పనపై ఇంకా కసరత్తు జరుగుతూనే ఉంది.గత కొన్నాళ్లుగా కమలం పార్టీలో నేతల మద్య విభేదాలు, ఆదిపత్య పోరు, వంటి తదితర అంశాలు వేదిస్తున్నాయి.

వీటిని తగ్గించి పార్టీని గాడిలో పెట్టేందుకు జాతీయ నేతలు సైతం ప్రయత్నిస్తున్నప్పటికి పెద్దగా ఫలితం కనిపించడం లేదు.

Telugu Bjprainbow, Congress-Politics

ఈ కారణం చేతనే కమలం పార్టీ( BJP ) రేస్ లో కొంత వెనుకబడిందనేది విశ్లేషకులు చెప్పే మాట.అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే ఎన్నికల రేస్ లో పార్టీ మరింత బలహీన పడే అవకాశం ఉంది.అందుకే వీలైనంత త్వరగా అభ్యర్థులను ప్రకటించి, ఎన్నికల హామీలను కూడా ప్రజల ముందు ఉంచాలని అధిష్టానం భావిస్తోంది.

ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ రెండు మూడు రోజుల్లో అభ్యర్థులను ప్రకటించి, ఆ వెంటనే మేనిఫెస్టో( Manifesto ) ప్రకటించేందుకు ప్రణాళికలను సిద్దం చేస్తోందట.

Telugu Bjprainbow, Congress-Politics

బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలను తలదన్నెలా మేనిఫెస్టో రూపకల్పన చేయాలని చేసి ప్రజల దృష్టి తమవైపు తిప్పుకోవాలని కమలనాథులు భావిస్తున్నారు.ముఖ్యంగా మేనిఫెస్టోలో ఏడు హామీలను( BJP Manifesto with 7 Promises ) హైలెట్ చేయబోతున్నట్లు టాక్ అందుకే మేనిఫెస్టో కు ఇంద్రదనస్సు అని నామకరణం చేయాలని చూస్తున్నారట.దీంతో బీజేపీ ఎలాంటి హామీలను ప్రకటించబోతోంది ? అనేది ఆసక్తికరంగా మారింది.అయితే బీజేపీ మేనిఫెస్టోపై ప్రజల్లో పెద్దగా ఆసక్తి లేదనే చెప్పాలి.మరి ప్రస్తుతం ఉనన్ పరిస్థితుల్లో కాషాయ పెద్దలు ప్రజలను ఎలా ఆకర్షిస్తారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube