బీజేపీ ప్లాన్ అదుర్స్ !

తెలంగాణలో ఎన్నికల వేళ ప్రధాన పార్టీలు అస్త్రశాస్త్రాలను సిద్దం చేసుకుంటున్నాయి.ఎలాగైనా గెలిచి అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నాయి.

 Bjp Plan Adurs , Bjp , Telangana Election , Brs , Congress Party , Politics-TeluguStop.com

హామీలు మేనిఫెస్టోలు ప్రకటిస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.ఆ కోవలో అధికార బి‌ఆర్‌ఎస్ ( BRS )తో కాంగ్రెస్ పార్టీ ( Congress party )కూడా కొంత ముందున్నాయి.

కానీ బీజేపీ ( BJP )మాత్రం ఎలక్షన్ స్ట్రాటజీలో చాలా వెనకబడినట్లు తెలుస్తోంది.కర్నాటక ఎన్నికల్లో ఓటమి తరువాత పూర్తిగా డీలా పడ్డా కాషాయ పార్టీ.

ఆ తరువాత రాష్ట్ర నేతల్లో నెలకొన్న అంతర్గత విభేదాల కారణంగా సతమతమౌతు వచ్చింది.జాతీయ నేతలు తరచూ రాష్ట్ర పర్యటన చేస్తున్నప్పటికి అనుకున్న స్థాయిలో పార్టీకి మైలేజ్ రావడం లేదు.

అటు బి‌ఆర్‌ఎస్ మరియు ఇటు కాంగ్రెస్ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

Telugu Cm Kcr, Congress, Revanth Reddy, Telangana-Politics

కానీ కాషాయ పార్టీ మాత్రం ఇప్పటివరకు అభ్యర్థుల జాబితాను ప్రకటించకపోగా.రేపు మాపు అంటూ ఆలస్యం చేస్తూనే ఉంది.దీంతో అసలు బీజేపీ ఏం ప్లాన్ చేస్తోంది.

తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధిచడం ఆ పార్టీకి కీలకం అయినప్పటికి ఎందుకు నిమ్మకు నిరెత్తినట్లు ఉంది అనే సందేహాలు చాలా మందిలో ఉన్నాయి.అయితే రాష్ట్ర ప్రజలను పార్టీ వైపు తిప్పుకునేందుకు పార్టీ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోందని, అందుకే ఆ ప్లాన్ సరైన టైమ్ చూసి అమలు చేసేందుకే సైలెంట్ గా ఉందనేది కొందరి వాదన.

అభ్యర్థుల ఎంపిక ఇప్పటికే పూర్తయిన వేళ ఈ రెండు మూడు రోజుల్లో తొలి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందట.ఇక ఆ తరువాత వెంటనే మేనిఫెస్టో ప్రకటించి వారానికి రెండు లేదా మూడు సార్లు జాతీయ నేతలు రాష్ట్ర పర్యటన చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారట.

Telugu Cm Kcr, Congress, Revanth Reddy, Telangana-Politics

ముఖ్యంగా ఈసారి బీసీ ఓటర్లే టార్గెట్ గా కమలనాథులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.రాష్ట్రంలో మెజారిటీ ఓటు బ్యాంక్ ఉన్న బీసీలను ఆకర్షిస్తే పార్టీకి తిరుగుండదనే ఆలోచన అధిష్టానంలో ఉందట.అందుకే అభ్యర్థుల ఎంపికలోనూ బీసీలకే అధిక ప్రదాన్యం ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారట.కుదిరితే సి‌ఎం అభ్యర్థిగా కూడా బీసీ నేతనే ప్రకటించే ఆలోచనలో కూడా ఉన్నారట.

ఇక త్వరలోనే రాష్ట్రంలో బీసీ గర్జన పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రచారానికి శ్రీకారం చుట్టాలని కమలనాథులు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.కాగా అటు బి‌ఆర్‌ఎస్ మరియు కాంగ్రెస్ పార్టీలు( Congress party ) కూడా బీసీలకే ఎక్కువ ప్రదాన్యం ఇస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ( BJP ) కూడా బీసీ మంత్రమే జపిస్తుండడంతో పార్టీకి ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube