అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ..

తెలంగాణలో బీజేపీ పాగావేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తోంది.2023 లక్ష్యంగా పావులు కదుపుతోంది.

వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

బండి సంజయ్ పాదయాత్రతో బీజేపీలో మరింత జోష్ పెరిగింది.దక్షిణాదిలో కర్నాటక తరువాత తెలంగాణలో అధికారంలోకి రావాలనే టార్గెట్ గా పెట్టుకుంది ఆ దిశగా రాష్ట్రపార్టీ కృషి చేస్తోంది.

కేంద్ర నాయకత్వం చేసిన దిశానిర్దేశంతో రాష్ట్ర నేతలంతా కలిసికట్టుగా పనిచేస్తూ ముందుకు సాగుతున్నారు.తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మరింత దూకుడుగా వెళ్లాలని నిర్ణయం తీసుకొంది.2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ నాయకత్వం పావులు కదుపుతుంది.ఈ దిశగానే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం వ్యూహాలతో ముందుకు వెళ్తోంది.2023లో తెలంగాణలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఈ సారి తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని అవకాశాలను అందిపుచ్చుకోవాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.

దుబ్బాక, హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సాధించిన విజయాలు ఆ పార్టీలో మరింత ఉత్సాహన్ని నింపాయి.హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం తరువాత రాష్ట్ర బీజేపీలో మరింత జోష్ పెరిగింది.

Advertisement

వీలు దొరికినప్పుడల్లా టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపుతూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ జీవో నెంబర్ 317కు వ్యతిరేకంగా ఉద్యమించారు.

తరువాత ఆయన్ను అరెస్టు చేయడం.కొన్ని రోజుల పాటు తెలంగాణ రాజకీయాల్లో కలకలానికి దారి తీసింది.

జాతీయ స్థాయి నేతలు తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలే అస్త్రంగా కమలనాథులు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.తెలంగాణ ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి రాజేసిన జీ.వో.నెంబర్ 317కు వ్యతిరేకంగా గళమెత్తిన బీజేపీ నేతలు.అదే ఊపులో తాము అధికారంలోకి వస్తే ఆ జీ.వో.కి సవరణలు చేస్తామని ప్రకటించారు.ప్రజల్లోకి వెళ్ళేందుకు సమస్యల అధారంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు.

బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 2కు విపరీతమైన ప్రజాదరణ రావడంతో బీజేపీ నేతల్లో మరింత జోష్ పెరిగింది.ఈ యాత్రలో బండి సంజయ్ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ , ప్రభుత్వ వైఫల్యాలను వారికి వివరిస్తూ ముందుకు సాగుతున్నారు.పొలంలో ఉన్న రైతుల దగ్గరకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

రోడ్డు పై వెళుతున్నప్పుడు బస్సు కనిపిస్తే దానిని ఆపి ప్రయాణికుల సమస్యలు అడిగి తెలుసుకుంటున్నారు, ప్రయాణికుల్ని ఏపని చేస్తున్నారు? అక్కడ సమస్యలేంటి ? వంటి వివరాలు తెలుసుకుంటున్నారు.అలాగే బస్సు కండక్టర్, డ్రైవర్లను కూడా పలకరిస్తున్నారు.

Advertisement

ఎక్కడైన వృద్దులు కనిపస్తే అవ్వా జరభద్రం ఎండలు ఎక్కువగా ఉన్నాయి.నీడపట్టున ఉండడని చెబుతున్నారు.

దీంతో బండి సంజయ్ పాదయాత్రకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.

దక్షిణాదిలో కర్నాకటలో తప్ప మరే రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలో లేదు.కర్నాటక తరువాత తెలంగాణలో మంచి ఆదరణ కనిపిస్తోంది.దీంతో 2023లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని పావులు కదపుతున్నారు.

వీలు చిక్కినప్పుడల్లా కేంద్ర మంత్రులు, నాయకులు తెలంగాణను చుట్టేస్తున్నారు.మొత్తానికి 2023 టార్గెట్ గా దూసుకుపోతోంది.

వచ్చే ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తామని అటు కేంద్ర బీజేపీ నేతలు, రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ధీమాగా ఉన్నారు.

తాజా వార్తలు