నేనూ వాళ్లలో ఒకడిని...!

‘నేను కూడా వారిలో ఒకడిని’ అని భాజపా నాయకుడు, మాజీ మంత్రి యశ్వంత్‌ సిన్హా చెప్పారు.వారిలో అంటే? పేదవారిలోనూ? కోటీశ్వరుల్లోనా? మేధావుల్లోనా? ఇలా ఎన్ని కేటగిరీలు చెప్పుకున్నా ఆయన దేంట్లోకీ రాడు.ఆయనది ‘బ్రెయిన్‌ డెడ్‌’ కేటగిరీ.భాజపాలో బ్రెయిన్‌ డెడ్‌ అయినవారిలో తానూ ఒకడినని సిన్హా అన్నారు.ఇలా అన్నది హాస్యానికి కాదు.ప్రధాని నరేంద్ర మోదీపై కోపంతో.

 Bjp Leadership Declared All Leaders Above 75 As ‘brain Dead’-TeluguStop.com

భాజపాలో డెబ్బయ్‌ ఐదు సంవత్సరాలు దాటినవారంతా బ్రెయిన్‌ డెడ్‌ అయినవారేనని, గత ఏడాది మే ఇరవైఆరోతేదీన వీరందరికీ బ్రెయిన్‌ డెడ్‌ అయిందని అన్నారు.యశ్వంత్‌ సిన్హా ఇలా అనడానికి కారణం ఏమిటంటే….

మోదీ ప్రధాని కాగానే డెబ్బయ్‌ఐదేళ్లు దాటినవారంతా మంత్రి పదవులకు పనికిరారని అన్నారు.అందుకే మేధావులుగా, అగ్రనాయకులుగా పేరుపడిన వారందరికీ పదవులు నిరాకరించి వారిని పనికిరానివారుగా పక్కన పడేశారు.

ఎల్‌కే అద్వానీ, మురళీమనోహర్‌ జోషీ, యశ్వంత్‌ సిన్హా…ఇలాంటివారు కొందరున్నారు.పెద్ద వయసువారు సరిగా పనిచేయలేరని మోదీ అభిప్రాయం కావొచ్చు.అందుకే యశ్వంత్‌ సిన్హా డెబ్బయ్‌ఐదు సంవత్సరాలు దాటినవారంతా బ్రెయిన్‌ డెడ్‌ అయ్యారని మోదీని ఉద్దేశించి వ్యగ్యంగా అన్నారు.‘దేశంలో ఎమర్జెన్సీ రాదని చెప్పలేం’ అని ఈమధ్య అద్వానీ కూడా మోదీని ఉద్దేశించి అన్నారు.వెటరన్లకు మోదీపై పీకల దాకా కోపం ఉందని అర్థమవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube