మెగాస్టార్ చిరంజీవి సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తారు అనే చర్చ సంవత్సర కాలం పాటు జరిగిన తర్వాత నిర్మాత రామ్ చరణ్ స్వయంగా ఈ సినిమాకు పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తాడు అంటూ ప్రకటించాడు.ఆగస్టులో ఈ సినిమా ప్రారంభం కాబోతుందని కూడా అంతా చెప్పుకొచ్చారు.
పూరి కూడా చిరుతో సినిమా చేయబోతుండటం చాలా సంతోషంగా ఉంది అంటూ ప్రకటించాడు.అయితే చిరంజీవి పుట్టిన రోజున ఈ సినిమాను ప్రారంభించనుండటంతో చాలా గ్యాప్ వచ్చింది.
దాంతో ఈ గ్యాప్‌లో అనేక రకాల పుకార్లు షికారు చేస్తూనే ఉన్నాయి.
ఇప్పటికే పలు సార్లు ఈ సినిమా నుండి పూరిని తప్పించినట్లుగా వార్తలు వచ్చాయి.
తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం చిరంజీవి 150వ సినిమాకు వినాయక్ దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.చిన్ని కృష్ణ రూపొందిస్తున్న ఒక కథతో వినాయక్ ప్రతిష్టాత్మక 150వ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే చిరంజీవితో వినాయక్ మరియు చిన్నికృష్ణలు భేటీ అయ్యి, కథను కూడా చర్చించారు.అతి త్వరలోనే వినాయక్ 150వ సినిమా దర్శకుడిగా అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలఱునన్నాయి.
పూరితో ఆ తర్వాత ఎప్పుడైనా చిరు సినిమా చేసే అవకాశాలున్నాయి.







