బీజేపీ నేత,మాజీ మంత్రి చిన్మయానంద ను అరెస్ట్ చేసిన సిట్ అధికారులు

మాజీ మంత్రి,బీజేపీ నేత చిన్మయానంద(73) ను యూపీ సిట్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.న్యాయశాస్త్ర విద్యార్థిని ఒకరు చిన్మయానంద పై లైంగిక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

 Bjp Leaderchinmayanand Arrest 1-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.న్యాయశాస్త్ర విద్యార్థిని తనపై లైంగిక ఆరోపణలకు దిగారు అని,43 వీడియోల ను పెన్ డ్రైవ్ లో విచారణ బృందానికి అందజేసిన నేపథ్యంలో చిన్మయానంద ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ఆయనపై అత్యాచారం కేసులో కూడా నిందితుడిగా ఉన్నాడు.ఈ క్రమంలో ఈ కేసులో విచారణ చేపట్టిన సిట్ అధికారులు సాక్ష్యాల ఆధారంగా చిన్మయ ను అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.

అయితే అసౌకర్యంగా ఉందన్న కారణంతో వైద్య పరీక్షల నిమిత్తం అతడిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు.

Telugu Chinmayanand, Physical-

  మరోపక్క చిన్మయ కు వ్యతిరేకంగా సిట్ అధికారులకు ఆధారాలు అందజేయడంతో చిన్మయానంద తనను తన కుటుంబ సభ్యులను హతమార్చుతానని బెదిరింపులకు గురిచేస్తున్నట్లు బాధితురాలు పేర్కొంది.అయితే ఈ విషయంలో తనకు తన కుటుంబానికి సాయం చేయాలి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ను ఆ బాధితురాలు కోరినట్లు తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube