దుబ్బాక ఉపఎన్నికలకు అన్ని పొలిటికల్ పార్టీ లు సిద్దమౌతున్న విషయం విదితమే.త్వరలో జరగబోయే ఈ ఎన్నికల ప్రచారం కోసం ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి.
ఈ నేపథ్యంలోనే తెలంగాణా బీజేపీ నేత,సినీ నటుడు బాబూ మోహన్ దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘు నందన్ రావు తరపున ప్రచారానికి దిగారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబ్బాక కు తెలంగాణా సీఎం కేసీఆర్ చేసింది ఏమి లేదని,దుబ్బాక ప్రజల కష్టాలు,సమస్యలు తీరాలి అంటే బీజేపీ కే ఓటు వేయాలి అంటూ ఆయన కోరారు.
ఇప్పటివరకు సీఎం కేసీఆర్ దుబ్బాక కు ఏమి చేయలేదని,చేయరు అని అసలు ఆయన ఎవరికీ కనిపించరు కూడా, ఆయన కరోనా లాంటి వారు అంటూ బాబూ మోహన్ ఎద్దేవా చేశారు.ఈ ఉపఎన్నికల్లో బీజేపీ ని గెలిపిస్తే మల్లన్న సాగర్ ముంపు బాధితుల సమస్యలు తీరిపోతాయి అని, ఒక వేళ దుబ్బాకలో టీఆర్ఎస్‌ను గెలిపించినా.
వారిని ప్రగతి భవన్ గేటు దగ్గరికి కూడా రానివ్వరంటూ ఆయన కామెంట్ చేశారు.దుబ్బాక నియోజక వర్గంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలిస్తేనే మల్లన్నసాగర్ ముంపు బాధితుల సమస్యలు తప్పకుండా తీరుతాయని,ఆయనకు ఓటు వేసి గెలిపించాలి అంటూ ఆయన స్పష్టం చేశారు.
అంతేకాకుండా గజ్వేల్, సిద్ధిపేట లు మాత్రం టీఆర్ ఎస్ సర్కార్ లో అభివృద్ధి చెందాయని కానీ దుబ్బాక లో మాత్రం ఎలాంటి అభివృద్ధి జరగలేదని ఆయన అన్నారు.
ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావు ప్రజలను మభ్యపెడుతున్నారని,ఎన్నికలు ముగిసిన తరువాత వారు అసలు కంటికి కూడా కనిపించరూ అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ అభ్యర్థి రఘనందన్ రావు ను ఈ ఉపఎన్నికల్లో గెలిపిస్తే ఈ మల్లన్న సాగర్ సమస్య పై నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ నే కలిసి పరిష్కారం పొందొచ్చు అంటూ బాబూ మోహన్ తెలిపారు.అంతేకాకుండా సీఎం కేసీఆర్ మాటమీద నిలబడే వ్యక్తి కాదని, ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాళ్లెవరూ కూడా ఇప్పుడు ఆయన వెంట లేరని బాబూమోహన్ అన్నారు.
ఒకప్పుడు కేసీఆర్‌ను తిట్టిన వాళ్లే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో చేరారు అంటూ బాబూ మోహన్ ఆరోపించారు.