కరోనాతో బీహార్ మంత్రి వినోద్ కుమార్ మృతి

కరోనా మహమ్మారి వ్యాధితో చికిత్స పొందుతున్న బీజేపీ నేత, బిహార్ మంత్రి వినోద్ కుమార్ సింగ్ తుదిశ్వాస విడిచారు.ఢిల్లీలోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు.

 Corona , Covid19, Bihar Minister, Vinodh Kumarm, Cm Nithish Kumar-TeluguStop.com

రేపు ఆయన మృతదేహాన్ని పాట్నాకు తరలించనున్నారు.బిహార్ వెనుకబడిన మరియు అత్యంత వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి, భారతీయ జనతా పార్టీ నేత వినోద్ కుమార్ సింగ్ కి మంచి గుర్తింపు ఉంది.

కాగా మరికొద్ది రోజుల్లో బిహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన స్థానమైన ప్రాన్‌పూర్ నుంచి ఆయన భార్య నిషా సింగ్‌ను ఎన్నికల బరిలోకి దింపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.జూన్‌లో మంత్రి వినోద్ కుమార్ కి ఆయన భార్యకూ కరోనా పాజిటివ్ అని తేలింది.

అయితే కొద్ది రోజుల చికిత్స తర్వాత ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు.ఆ తర్వాత నెలన్నర తర్వాత అనారోగ్య సమస్యతో వినోద్ కుమార్‌ ఢిల్లీలోని మేదాంత ఆసుపత్రిలో చేరారు.

రెండు రోజుల నుంచి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది.దీనితో సోమవారం అయన తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు.

గత రెండు నెలలుగా మెరుగైన చికిత్స అందించినప్పటికీ మెదడులో రక్తం గడ్డకట్టడంతో మృత్యువు ఆయనను కబళించింది.వెనుబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రిగా వినోద్ సింగ్ర మరణంపై ముఖ్యమంత్రి నితీష్ కుమార్ విచారం వ్యక్తం చేశారు.

సమర్థుడైన ప్రజాదరణ పొందిన నాయకుడంటూ సంతాపం వ్యక్తం చేశారు.ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలకు నష్టమని బీజేపీ పేర్కొంది.

కతిహార్ జిల్లా ప్రాణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా వినోద్ సింగ్ మూడుసార్లు గెలుపొందారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube