ఏపీలో పొత్తులపై బీజేపీ ఫోకస్ ! తరుణ్ చుగ్ ఏం తేల్చుతారో ?

ఏపీ బీజేపీలో( AP BJP ) కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి.

ఎన్నికల సమయం దగ్గరపడిన నేపథ్యంలో, పొత్తుల విషయంలో ఒక క్లారిటీ రావాలని బిజెపి అధిష్టానం నిర్ణయించింది.

ఇప్పటికే టిడిపి,  జనసేన పొత్తు( TDP Janasena Alliance ) కొనసాగిస్తుంది.జనసేన బిజెపితో పొత్తులో ఉన్నా,  టిడిపి తోనే కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది.

బిజెపి ఈ విషయంలో ఒక క్లారిటీ కి రావాలని నిర్ణయించుకుంది.బిజెపి, జనసేన టిడిపి, కూటమి గా ఏర్పడితే కచ్చితంగా అధికారంలోకి వస్తామనే నమ్మకం బిజెపి పెద్దలలోను ఉంది.

అయితే ఏపీ బీజేపీలో రెండు గ్రూపులుగా పార్టీ నాయకులు ఉండడం , ఒక గ్రూపు టిడిపితో( TDP ) పొత్తు ఉండాలని పట్టుబడుతుండగా,  మరో గ్రూపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ టిడిపితో పొత్తు పెట్టుకోవద్దని ఒత్తిడి చేస్తుంది.ఈ నేపథ్యంలో దీనిపై ఏం చేయాలి ?  ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే విషయంలో ఒక క్లారిటీకి రావాలని బిజెపి అధిష్టానం నిర్ణయించుకుంది.

Advertisement

ఈ మేరకు నేడు బిజెపి ముఖ్య నాయకులతో విజయవాడలో బిజెపి కీలక నేత తరుణ్ ఛుగ్( Tarun Chugh ) ఆధ్వర్యంలో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా పొత్తుల అంశంపై పార్టీ నాయకుల అభిప్రాయాలను తరుణ్ చుగ్ తీసుకోనున్నారు.దీనిపై అధిష్టానానికి ఆయన నివేదిక ఇవ్వనున్నారు.

ఆ తరువాత ఏపీ విషయంలో ఏం చేయాలి ? ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో బిజెపి పెద్దలు ఒక క్లారిటీకి రానున్నారు.అయితే వైసిపి ( YCP ) విషయంలో బిజెపి ఏ నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఒక క్లారిటీకి రాలేకపోతోంది .

తమతో నేరుగా పొత్తు పెట్టుకునేందుకు వైసిపి ఏ మాత్రం ఇష్టపడడం లేదు.కానీ బిజెపికి అవసరమైన సమయంలో వైసీపీ సహకారం అందిస్తోంది.అలాగే కేంద్ర బిజెపి పెద్దలతోనూ జగన్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తుండడం,  ఏపీ బీజేపీ నేతలు వైసిపి ప్రభుత్వం పై విమర్శలు చేసినా, ఆ పార్టీ నాయకులు పెద్దగా స్పందించకపోవడం వంటివి చోటు చేసుకుంటున్నాయి.

దీంతో నేటి సమావేశంలో తరుణ్ ఛుగ్ కు ఏపీ బీజేపి నాయకులు ఏ విధమైన క్లారిటీ ఇస్తారు ?  దీనిపై బీజేపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోబోతుంది అనేది తేలాల్సి ఉంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి3, సోమవారం 2025
Advertisement

తాజా వార్తలు