కరోనాతో మృతిచెందిన బీజేపీ ప్రముఖ నేత..!!

మహమ్మారి కరోనా వైరస్ ప్రభావం దేశంలో మళ్లీ మొదలవుతుంది అనే పరిస్థితులు ప్రస్తుతం దాపరుస్తున్నాయి.

ఇప్పటికే పలు రాష్ట్రాలలో కేసులు భారీ స్థాయిలో పెరగటంతో ఇటీవల దేశ ప్రధాని దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అదేవిధంగా కేంద్రపాలిత గవర్నర్లకు కీలక ఆదేశాలు ఇవ్వటం జరిగింది.

సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉందని .రాష్ట్రాలలో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేయాలని పేర్కొన్నారు.దేశంలో పరిస్థితి ఇలా ఉండగా తాజాగా మహమ్మారి కరోనా వల్ల బిజెపి పార్టీకి చెందిన ప్రముఖ నేత కేంద్ర మాజీ మంత్రి దిలీప్ గాంధీ మరణించారు.69 సంవత్సరాల వయసు కలిగిన ఈయన ఇటీవల వ్యక్తిగత పని నిమిత్తం ఢిల్లీ వెళ్లటం జరిగింది.అయితే అక్కడ కరోనా లక్షణాలు బయటపడటంతో వెంటనే .ప్రైవేట్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.చికిత్స పొందుతున్న తరుణంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఇటీవల ఆయన కన్నుమూశారు.

ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు వెల్లడించారు.అప్పట్లో ఎన్డీఏ హయాంలో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో  దిలీప్ గాంధీ నౌకాయాన శాఖ సహాయమంత్రిగా పనిచేశారు.

ఈయనకి ఒక భార్య ఇద్దరు కుమారులు మరియు ఒక కుమార్తె ఉన్నారు.దిలీప్ గాంధీ మరణంతో బిజెపి పార్టీ లో విషాద ఛాయలు అలముకున్నాయి.

Advertisement

దిలీప్ గాంధీ మృతికి తాజాగా ప్రధాని మోడీ సంతాపం వ్యక్తం చేశారు. .

వైరల్ వీడియో : క్యాబ్ డ్రైవర్ తో హీరో గొడవ..
Advertisement

తాజా వార్తలు