CM Ramesh : కాంగ్రెస్ ఖాతాలోకి బీజేపీ నేత సీఎం రమేశ్ రూ.30 కోట్లు..??

ఏపీ బీజేపీలో కీలక నేత మరో పార్టీ అయిన కాంగ్రెస్ ( Congress )ఖాతాలోకి రూ.30 కోట్లు పంపారు.టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికైన ఈ నేత బీజేపీలో చేరారు.ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఖాతాకు విరాళం అందజేశారు.అదేంటి? ఎవరా నేత? అనుకుంటున్నారా? ఆయనే సీఎం రమేశ్.ప్రస్తుతం ఆయన ఏపీ రాజకీయాల్లో హాట్ టాఫిక్ గా మారారని తెలుస్తోంది.

 Cm Ramesh : కాంగ్రెస్ ఖాతాలోకి బీజేప-TeluguStop.com

ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న సీఎం రమేశ్( CM Ramesh ) పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది.మరోసారి ఎంపీగా విజయం సాధించాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.అయితే బీజేపీ నేతగా ఉన్న సీఎం రమేశ్ కాంగ్రెస్ ఖాతాలోకి రూ.30 కోట్లు వేయడంతో డబుల్ గేమ్ ఆడుతున్నారా అంటూ టాక్ వినిపిస్తోంది.దీనికి కారణం వెలుగులోకి వచ్చిన ఎన్నికల బాండ్లే అని తెలుస్తోంది.బీజేపీ ఎంపీ అయిన సీఎం రమేశ్ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి రూ.30 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనిచ్చారు.అలాగే కర్ణాటకలోని మరో పార్టీ జేడీఎస్ కు పది కోట్లను ఎలక్టోరల్ బాండ్ల( Electoral bonds ) ద్వారా విరాళం ఇచ్చిన ఆయన తన మాతృ పార్టీ అయిన టీడీపీకి రూ.5 కోట్ల విరాళం ఇచ్చారు.ఈ నేపథ్యంలోనే బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే పార్టీలకు ఆయన విరాళం అందించడం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

అంతేకాదు ఈ వ్యవహారంపై పలు ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.

చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా ఉండే సీఎం రమేశ్ బీజేపీలో చేరారన్న సంగతి తెలిసిందే.

అయితే ఆయన టీడీపీలో ఉన్న సమయంలో పార్టీకి సంబంధించిన అన్ని ఆర్థిక వ్యవహారాన్ని చూసుకునే వారని చెబుతుంటారు.అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో రకరకాల ప్రాజెక్టులు చేపట్టిన సీఎం రమేశ్ ఏపీ కన్నా ఇతర రాష్ట్రాల్లోనే ఎక్కువగా పనులు చేపట్టేవారన్న సంగతి అందరికీ తెలిసిందే.

కాగా సీఎం రమేశ్ కు రిత్విక్ ప్రాజెక్ట్స్ అనే కంపెనీ ఉంది.ఈ కంపెనీ ద్వారానే సీఎం రమేశ్ కాంగ్రెస్ కు రూ.30 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను అందించారు.ఒక్కో బాండ్ విలువ రూ.కోటి కాగా మొత్తం 30 బాండ్లను హస్తం పార్టీకి అందజేశారు.ఆయన అందించిన ఎలక్టోరల్ బాండ్ల నంబర్లు 14402, 14412, 14414, 14416,14418, 14420,14422, 14424, 14426, 14427, 14429, 14431, 14433, 14435, 14437, 14439, 14441, 14443, 14445, 14447, 14449, 14451, 14454, 14456, 14458, 14460, 14462, 14464, 14466, 14477 అని తెలుస్తోంది.

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ తెర వెనుక హస్తం పార్టీతో టచ్ లో ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.తెర ముందు మాత్రం బీజేపీ, జనసేనతో పొత్తు.

తెర వెనుక కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు తాను చెప్పినట్లుగా ఆడేందుకు ఈ విధంగా కాంగ్రెస్ కు ప్యాకేజీ పంపి ఉంటారని పలువురు చెబుతున్నారని తెలుస్తోంది.వైఎస్ జగన్ టార్గెట్ గా కుట్ర రాజకీయాలకు తెర తీసిన చంద్రబాబు తాను కేసుల నుంచి బయటపడటం కోసం కమలం పార్టీతో.

కాపు ఓట్ల కోసం జనసేనతో పొత్తు పెట్టుకున్నారు.ఇవన్నీ చాలవనీ తెర వెనుక కాంగ్రెస్ తో లాలూచీ పడ్డారని తెలుస్తోంది.అయితే 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన సీఎం రమేశ్ ను చంద్రబాబే బీజేపీ గూటికి చేర్చారని ఏపీ ప్రజలు గుసగుసలాడుతున్నారట.ఈ క్రమంలోనే సీఎం రమేశ్ ద్వారానే 2023 లో కాంగ్రెస్ పార్టీ రూ.30 కోట్ల నిధులను సైతం పంపారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అంతేకాదు కాంగ్రెస్ కు నిధులు అందిన తరువాతే వైఎస్ షర్మిల ( YS Sharmila ) పార్టీ విలీనం కావడం.

ఆమె ఏపీ పీసీసీగా నియామకం అవడం జరిగాయని తెలుస్తోంది.అందుకే చంద్రబాబు వదిలిన బాణంగా వైఎస్ షర్మిల రాష్ట్రంలో అడుగుపెట్టినప్పటి నుంచి జగనే టార్గెట్ గా విమర్శలు చేస్తున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారని సమాచారం.

ఇందులో భాగంగానే ఆమె కడప పార్లమెంట్ స్థానం నుంచి కూడా పోటీ చేయనున్నారని సమాచారం.వైఎస్ షర్మిల, జనసేనాని పవన్ కల్యాణ్ సహా చంద్రబాబు బ్యాచ్ మొత్తానికి ప్రత్యేక విమానం కూడా సీఎం రమేశ్ దే కావడం గమనార్హం.

Telugu Bjp, Bjpcm, Cm Ramesh, Congress, Electoral Bonds, Rs, Ys Jagan, Ys Sharmi

ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో చంద్రబాబుపై( Chandrababu ) ఏపీ ప్రజలు విమర్శలు గుప్పిస్తున్నారట.బీజేపీ, జనసేనతో బహిరంగ పొత్తు ప్రకటించిన టీడీపీ, కాంగ్రెస్ ఒకటేనని వాదనలు వినిపిస్తున్నాయి.కాంగ్రెస్ ను నిధులు పంపడంతో ఆధారాలతో సహా బట్టబయలు కావడంతో ఇదంతా చంద్రబాబు కనుసన్నల్లోనే జరిగిందంటూ పలువురు అభిప్రాయ పడుతున్నారని సమాచారం.ఎలక్ట్రోరల్ బాండ్ల ద్వారా కాంగ్రెస్‌కు రూ.30 కోట్లు అప్పజెప్పిన బాబు… అనధికారికంగా ఎన్ని వందల కోట్లు అందించారో అంటూ పలు ప్రశ్నలు ప్రతి ఒక్కరి మదిలో తలెత్తుతున్నాయట.

Telugu Bjp, Bjpcm, Cm Ramesh, Congress, Electoral Bonds, Rs, Ys Jagan, Ys Sharmi

ఎందుకంటే.సీఎం రమేష్ బీజేపీలో ఉన్నా.నూటికి నూరు శాతం చంద్రబాబు మనిషేనని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారని తెలుస్తోంది.

చంద్రబాబు మనిషిగా బీజేపీలో ఉంటూనే ఢిల్లీ లాబీయిల్లో నారా వారి ప్రయోజనాలు చక్కపెట్టడం ప్రారంభించారని పలువురు చెబుతున్నట్లు తెలుస్తోంది.ప్రజాక్షేత్రంలో వైఎస్ జగన్ ( YS Jagan )ను ఢీకొట్టలేమని గ్రహించిన చంద్రబాబు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును అడ్డుపెట్టుకుని ఆ కుటుంబంలో చిచ్చు పెట్టడం ప్రారంభించారని, ఈ క్రమంలోనే వైఎస్ సునీతారెడ్డిని చెరదీశారంటూ వాదనలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా అధికారం ఆశ చూపెట్టి షర్మిలను సైతం తనవైపు తిప్పుకున్నాడని చర్చ జోరుగా సాగుతుంది.అయితే సీఎం రమేశ్ కంపెనీ ద్వారా కాంగ్రెస్ పార్టీకి రూ.30 కోట్ల విరాళం సంగతి బట్టబయలు కావడంతో టీడీపీ, కాంగ్రెస్ మధ్య సంబంధం ఏంటనే విషయం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube