భారీ విరాళం అందించి గొప్ప మనసును చాటుకున్న బిజెపి నేత చెన్నమనేని వికాస్ రావు దీపా దంపతులు!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని 20 వ వార్డు కు చెందిన గోగికారి ప్రహ్లద్ అనే వ్యక్తి గతంలో కోవిడ్ వల్ల మరణించగా వారి కుటుంబ సభ్యులకు అండగా ఇంటి ఆడబిడ్డకు ఉన్నత చదువుల నిమిత్తం గొగికారి శివానికి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చదువు కోసం డాక్టర్ చెన్నమనేని వికాస్ ను 20వ వార్డు కౌన్సిలర్ బిజెపి పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు అభ్యర్థించారు.

ఈ మేరకు వెంటనే స్పందించి 50,000 వేల రూపాయలను చెక్ ద్వారా అందించి నేనున్నానని భరోసా కల్పించారు.

బిజెపి నాయకులు డాక్టర్ చెన్నమనేని వికాస్ రావు దీపా దంపతులు.ఈ సందర్బంగా శివాని అమ్మ, పెద్ద నాన్న గొగికారి రాము కుటుంబ సభ్యులు విద్యార్థి ఉన్నత చదువు కు ఆర్థిక సహాయం అందించిన డాక్టర్ చెన్నమనేని వికాస్ దీప దంపతులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కోరెపు వెంకటేష్, అమానుల్లా ఖాన్, అన్నారం శివ, ఆల్గం సాయికృష్ణ, ఖమ్మం పృధ్వీ, గుగ్గిల్ల రంజిత్, దాము, సత్యనారాయణ, బిజెపి నాయకులు వార్డు సభ్యులు పాల్గొన్నారు.

బడి బయట విద్యార్థుల గుర్తింపుకు ప్రత్యేక సర్వే
Advertisement

Latest Rajanna Sircilla News