ఏపీలో బీజేపీ, జనసేన( BJP, Jana Sena ) పార్టీలకు అసలు ఉనికే లేదని ప్రభుత్వ సలహాదారు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ) అన్నారు.బీజేపీ, జనసేనను నమ్ముకున్న వారికి నిరాశేనని తెలిపారు.
చంద్రబాబు( Chandrababu ) తన కూటమిలోని వారినే చిన్న చూపు చూస్తున్నారని సజ్జల పేర్కొన్నారు.కూటమిలో బీజేపీ, జనసేనకు ఉనికి లేకుండా చంద్రబాబు చేస్తున్నారన్నారు.
చంద్రబాబు ఫ్రస్టేషన్ పరాకాష్టకు చేరిందన్న సజ్జల గత ఎన్నికల కంటే టీడీపీ ఘోరంగా ఓడిపోతుందని తెలిపారు.అధికారులపై చంద్రబాబు అండ్ కో కావాలనే తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని మండిపడ్డారు.
ఇప్పుడు కూడా అధికారులను కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు.ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు.