తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేసీఆర్ రాష్ట్రంలోని రైతులను మోసం చేశారని ఆయన ఆరోపించారు.
రైతులకు ఫసల్ బీమా యోజన పథకం అమలు చేయలేదని విమర్శించారు.ఖమ్మంలో రైతులకు బేడీలు వేశారన్న ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రైతులకు కేంద్రం ఏడాదికి రూ.6 వేలు సాయం చేస్తోందని తెలిపారు.అయితే ఖమ్మం జిల్లా ప్రజలు అందరూ బీజేపీ వెంటనే ఉన్నారని పేర్కొన్నారు.
బీజేపీ బహిరంగ సభలో చాలా మంది నేతలు పార్టీలో చేరతారని వెల్లడించారు.తెలంగాణలో బీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయమని తెలిపారు.
కాగా ఇవాళ ఖమ్మం జిల్లాలో రైతు గోస- బీజేపీ భరోసా కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే.ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.