ఆ విషయంలో బీఆర్ఎస్ ని దెబ్బకొట్టి కాంగ్రెస్ కి సపోర్ట్ చేస్తున్న బీజేపీ..!!

తెలంగాణ ( Telangana ) లో రాజకీయ సమీకరణాలు గంట గంటకి మారుతున్నాయి.ఇప్పటికే ఎన్నికలకు 2 రోజుల సమయం కూడా లేదు.

 Bjp Is Supporting Congress By Damaging Brs In That Matter , Amith Sha, Congr-TeluguStop.com

ఇవాల్టితో ఎన్నికల ప్రచారం ముగుస్తుంది.నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్ జరగబోతుంది.

దీంతో కార్యకర్తలు నాయకులు అందరూ ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.ఇదిలా ఉంటే ఎప్పటినుండో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని,ఒకవేళ బిఆర్ఎస్ ( BRS ) కి తెలంగాణలో ఏమాత్రం తక్కువ స్థానాలు వచ్చినా బహిరంగంగానే బీజేపీ బిఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తుందనే వాదన కూడా ఉంది.

ఎందుకంటే కాంగ్రెస్ బిజెపి రెండు నేషనల్ పార్టిస్ కాబట్టి కచ్చితంగా ప్రాంతీయ పార్టీ అయినా బీఆర్ఎస్ కి బీజేపీ సపోర్ట్ చేస్తుంది.

Telugu Amith Sha, Congress, Majlis, Narendra Modi, Rahul Gandhi-Politics

అయితే ఒక విషయంలో మాత్రం బిఆర్ఎస్ ని దెబ్బ కొట్టి ఆ ఓట్లన్ని కాంగ్రెస్ ( Congress ) కి పడేలా చేస్తుంది బిజెపి.ఇక అసలు విషయం ఏమిటంటే.బిజెపి పార్టీకి సంబంధించిన కీలక నాయకులు ఈ మధ్యకాలంలో ఏ బహిరంగ సభలో పాల్గొన్నా కూడా మైనారిటీలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లు తొలగించేస్తామని చెప్పుకుంటూ వస్తున్నారు.

ఇక ఈ విషయాన్ని అమిత్ షా ( Amith sha ) కూడా ప్రస్తావించారు.అయితే బిఆర్ఎస్ కేవలం బీజేపీ పార్టీతోనే కాకుండా మజ్లీస్ పార్టీతో కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి.

Telugu Amith Sha, Congress, Majlis, Narendra Modi, Rahul Gandhi-Politics

ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ కి సపోర్ట్ చేయాలి అని మజ్లీస్ నాయకులు బహిరంగంగానే ప్రకటించారు.అయితే బిజెపి ( BJP ) కి బీఆర్ఎస్ కి కూడా సంబంధం ఉన్న కారణంగా బిజెపి నాయకులు చెప్పే ఇలాంటి మాటలు ముస్లింలకు రుచించడం లేదు.దీంతో బీఆర్ఎస్ కు మద్దతిచ్చే విషయంలో వెనకడుగు వేస్తున్నారు మైనారిటీలు(Mi.అయితే బిజెపి పార్టీ మాత్రం ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడితే హిందువుల ఓట్లన్నీ గంపగుత్తగా తమకే పడతాయి అని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే వారి పార్టీ క్షేమం కోసం తమతో పొత్తు పెట్టుకున్న బిఆర్ఎస్ పార్టీని గట్టి దెబ్బ కొడుతున్నారు.ఇక ఈ విషయం ప్రజల్లోకి బలంగా వెళ్తే గనుక కచ్చితంగా నవంబర్ 30న జరిగే పోలింగ్లో ముస్లింలందరూ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏది ఏమైనప్పటికీ తమకి బద్ధ శత్రువు అయిన కాంగ్రెస్ పార్టీకి ఈ విషయంలో మాత్రం బిజెపి పార్టీ పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నట్లు అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube