మీకు దమ్ముంటే...! టీఆర్ఎస్ లోని కాంగ్రెస్ ఎమ్మెల్యే లను రెచ్చగొడుతున్న బీజేపీ 

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుంటూ ఇప్పుడు బిజెపి తెలంగాణలో పై చేయి సాధించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.టిఆర్ఎస్ పై జనాల్లో వ్యతిరేకత పెరిగిందని, సర్వేల ద్వారా ఒక అంచనాకు వచ్చిన బిజెపి ఇప్పుడు ఎన్నికలు జరిగితే బిజెపి దే విజయం అన్న ధీమా లో ఉంది.

 Bjp Is Provoking Congress Mlas In Trs , Bjp, Congress, Trs, Congress Mlas, Munug-TeluguStop.com

రాబోయే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కోవడం కంటే, ముందుగా తెలంగాణలో తమకు గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అనేది ఒక అంచనాకు వచ్చేందుకు ప్రయత్నిస్తోంది.ఇప్పటికే దుబ్బాక, హుజురాబాద్ ఎన్నికలలో బిజెపి సత్తా చాటుకుంది.

ఇప్పుడు మునుగోడు లోను ఉప ఎన్నికలు రాబోతూ ఉండడంతో అక్కడ తప్పకుండా గెలుస్తాము అనే ధీమాలో ఉంది.కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి, పార్టీకి రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల ను ఇప్పుడు టిఆర్ఎస్ టార్గెట్ చేసుకుంటోంది.

ఈ మేరకు మహబూబ్ నగర్ లో జరిగిన ప్రజా ఘోష- బిజెపి భరోసా యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకుంటూ వారికి సవాలు విసిరారు.

పార్టీ ఫిరాయించిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దమ్ముంటే రాజీనామా చేయాలని రాజేందర్ సవాల్ విసిరారు.

రోషం ఉన్న వ్యక్తి కాబట్టే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని, బై ఎలక్షన్స్ రావాలంటే దమ్ము కూడా ఉండాలని ఈటెల రాజేందర్ అన్నారు.రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన వెంటనే స్పీకర్ దానిని ఆమోదించారని, రాజగోపాల్ రెడ్డి తరహాలో మీ నియోజకవర్గాల్లో ప్రజాభిప్రాయాన్ని కోరాలని రాజేందర్ సూచించారు.12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయకుండా టిఆర్ఎస్ లో చేరారని ,కొంతమంది మంత్రి పదవులు కూడా వెలగబెడుతున్నారంటూ వెటకారం చేశారు.

Telugu Congress, Congress Mlas, Komatirajagopal, Telangana Cm, Telangana-Politic

మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని, ఆ నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలంటే, నియోజకవర్గాల అభివృద్ధి మీరు నిజంగా ఆకాంక్షిస్తూ ఉంటే.మీరు కూడా రాజీనామా చేయాలని రాజేందర్ సూచించారు.రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో పది లక్షల మందికి పెన్షన్ ప్రకటించారని రాజేందర్ గుర్తు చేశారు.

రాజకీయాల్లో కూడా నైతికత ఉండాలంటూ పార్టీ ఫిరాయించిన నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.రాజీనామా చేయకుండా టిఆర్ఎస్ పార్టీలో చేరి కొంతమంది నేతలు నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఎవరైనా సరే పార్టీ మారాలంటే రాజీనామా చేయాలని దమ్ము ధైర్యం ఉన్న నాయకులు రాజీనామా చేసి రావాలని రాజేందర్ సవాల్ విసిరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube