తెలంగాణ బీజేపీ రోజురోజుకు బలపడాలని పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే తెలంగాణలో యాసంగి వరి ధాన్యం కొనుగోళ్ళపై ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ఒక యాక్షన్ ప్లాన్ ప్రకటించిన నేపథ్యంలో సింగరేణి ని ప్రైవేటీకరణ చేస్తుందన్న అంశం పెద్ద ఎత్తున టీఆర్ఎస్ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఇటు రైతులలోనూ, సింగరేణి కార్మికులలోనూ వ్యతిరేకత మొదలవుతున్నదన్న భయాల నేపథ్యంలో బీజేపీ నష్ట నివారణ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
ఎందుకంటే ఇప్పుడిప్పుడే టీఆర్ఎస్ పై వ్యతిరేకతను మరో లెవెల్ కి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ఈడీ దాడులు కూడా మొదలైన నేపథ్యంలో ఏ ఒక్క విషయంలో కూడా బీజేపీ ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకోవద్దనే ఉద్దేశ్యంతో చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది.అయితే బీజేపీ ని అడ్డుకోవడంపై టీఆర్ఎస్ చాలా విధాలుగా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఇక ఇప్పటికే కొంత మేర టీఆర్ఎస్ సక్సెస్ అయిందన్న వార్తల నేపథ్యమే బీజేపీ మరింతగా జాగ్రత్త పడటానికి కారణమని చెప్పవచ్చు.

బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో ఎదగనిచ్చే ప్రసక్తే లేదని అటువంటి వాతావరణాన్ని ఎట్టి పరిస్థితులలోనూ కల్పించవద్దని కెసీఆర్ ఇప్పటికే మంత్రులకు కీలక ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో రాజకీయ వైరం రోజురోజుకు పెరుగుతున్న పరిస్థితి ఉంది.అయితే ఇప్పటికే దేశ వ్యాప్త సమ్మె కు సింగరేణి కార్మికులు మద్దతిచ్చిన నేపథ్యంలో బండి సంజయ్ సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన లేదని కొంత రాష్ట్ర బీజేపీకి రాజకీయంగా ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో వ్యాఖ్యానిస్తున్నా సింగరేణిని ప్రైవేటీకరణ నుండి ఆపే అవకాశం లేదనేది సుస్పష్టం.ఎందుకంటే ఇది విధానపరమైన నిర్ణయం.బీజేపీ చెప్పినా కూడా సింగరేణి కార్మికులు దేశ వ్యాప్త సమ్మెకు మద్దతిస్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా ఇవ్వన్నీ అంశాలు కెసీఆర్ చేతిలో ఆయుధాలుగా మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నాయి.







