యంగ్ టైగర్ ఎన్టీఆర్ యమదొంగ సినిమా నుంచి బరువు తగ్గి కొత్త లుక్ లో దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే.ఆ తర్వాత సినిమాలకు అనుగుణంగా తారక్ బరువు తగ్గడం, పెరగడం చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని పాత్ర కోసం బరువు పెరిగిన తారక్ కొమురం భీమ్ పాత్రలో కొంచెం లావుగానే కనిపించారు.అయితే దర్శకుడు రాజమౌళి ఎన్టీఆర్ తిండి, బరువు గురించి ఆర్ఆర్ఆర్ మూవీలో సెటైర్లు వేయడం గమనార్హం.
ఒక సన్నివేశంలో ఎన్టీఆర్ మాంసం తీసుకొని వెళుతుండగా సముద్రఖని “వీడి ఆకలికి అది సరిపోతుందంటావా” అంటూ కామెంట్ చేయగా చరణ్ “దిష్టి పెట్టకండి బాబాయ్” అని సమాధానం ఇస్తాడు.నాటు నాటు పాట తర్వాత చరణ్ తారక్ ను మోస్తూ టన్ను బరువు ఉన్నావంటూ కామెంట్ చేస్తారు.
మరో సన్నివేశంలో ఎన్టీఆర్ భోజనం చేస్తుండగా తిన్నది చాలు పార్టీకి పదా అంటూ జక్కన్న చరణ్ తో చెప్పించారు.
రాజమౌళి సరదాగా తారక్ ఫుడ్, బరువు గురించి ఆర్ఆర్ఆర్ లో కామెంట్లు చేయించారని కొందరు ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్, చరణ్ ఆర్ఆర్ఆర్ మూవీలో కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు.ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కితే బాగుంటుందని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.
నాటు నాటు సాంగ్ లో ఎన్టీఆర్ డ్యాన్సింగ్ స్కిల్స్ కు ప్రేక్షకులు అవాక్కవుతున్నారు.

మూడు గంటల నిడివితో ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కగా ప్రేక్షకులను ఈ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది.ఎన్టీఆర్, చరణ్ నాలుగేళ్ల కష్టానికి ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రతిఫలం దక్కిందనే చెప్పాలి.ఆర్ఆర్ఆర్ మూవీలో కథ వీక్ గానే ఉన్నా కథనంతో జక్కన్న మ్యాజిక్ చేసి ప్రేక్షకుల మనసు దోచేశారు.
ఆర్ఆర్ఆర్ చరణ్, తారక్ కెరీర్ కు ఎంతమేర ప్లస్ అయిందో తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.







