తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే..: మోదీ

తెలంగాణ

కొత్త చరిత్ర లిఖించబోతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.మహబూబాబాద్ లో బీజేపీ అభ్యర్థులకు మద్ధతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆయన ప్రసంగించారు.

బీఆర్ఎస్

పాలనకు ప్రజలు చరమగీతం పాడతారని

మోదీ

పేర్కొన్నారు.ఈ క్రమంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకానుందని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ నాశనం చేశాయని ఆరోపించారు.బీజేపీ అధికారంలోకి వస్తుందన్న

మోదీ

తెలంగాణలో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి కాబోతున్నారని తెలిపారు.

రాష్ట్ర ప్రజలందరూ తన కుటుంబ సభ్యులని పేర్కొన్నారు.ఎన్డీఏలో కలవాలని కేసీఆర్ ప్రయత్నించారన్న ఆయన కుదరకపోవడంతో బీజేపీపై విమర్శలు చేస్తున్నారని విమర్శించారు.

Advertisement

మూఢ నమ్మకాలతో సచివాలయాన్ని కూల్చారన్నారు.ఫామ్ హౌస్ సీఎం తెలంగాణకు అవసరమా అని ప్రశ్నించారు.

శ్రీవారి ఆలయంలో శ్రీలీల బుగ్గగిల్లిన తమన్... ఆలయంలో ఈ పనేంటంటూ ట్రోల్స్?
Advertisement

తాజా వార్తలు