తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.నిజామాబాద్ జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు.
గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగురవేయాలని ప్రజలు కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.ఎన్ని తప్పుడు ప్రచారాలు, ఆరోపణలు చేసినా రాష్ట్ర ప్రజలు బీజేపీని ఆశీర్వదించడానికి సిద్దంగా ఉన్నారు.
అందుకే చాలు కేసీఆర్.సెలవు కేసీఆర్ అదేవిధంగా చాలు కుటుంబ పాలన.
సెలవు కుటుంబపాలన అంటూ నినాదించారు.కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది బీఆర్ఎస్ పార్టీకి సీటుగా మారుతుందన్నారు.
ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను ప్రజలు కోరుకోవడం లేదన్నారు.రైతుల సంక్షేమం కోసం నిజామాబాద్ జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పసుపు బోర్డును ఏర్పాటు చేశారని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో అభివృద్ధే ధ్యేయంగా ముందుకు వెళ్తున్న బీజేపీని బలోపేతం చేయడంతో పాటు గెలుపును అందించాలని కోరారు.







