కొన్ని రకాల ఆహార పదార్థాలు తిన్న తర్వాత చాలామందికి ఫుడ్ పాయిజన్( Food poisoning ) అవుతూ ఉంటుంది.అలాంటి సమయంలో ఏం తినాలో చాలామందికి అస్సలు తెలియదు.
ఇలాంటి సమయంలో కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.కాబట్టి అసలు తినకూడదు.
మరి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి.ఎలాంటి ఆహారాలను తీసుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే అరటి పండ్లు( Bananas ), అన్నం, ఆపిల్ సస్ లతో కూడిన ఈ ఆహారం సాధారణంగా జీర్ణక్రియను సులభతరం చేయడానికి ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే తాజా కూరగాయలు ఉడకపెట్టిన పులుసు వంటి సులభంగా జీర్ణం అయ్యే సూపులు జీర్ణ వ్యవస్థను( Digestive system ) చికాకు పెట్టకుండా పోషకాలను అందిస్తాయి.

అలాగే ప్రోబయోటిక్ అధికంగా ఉండే పెరుగు ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాను( Bacteria ) పునరుద్ధరించడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది.ఇంకా చెప్పాలంటే ఉడికించిన కూరగాయలు పచ్చి వాటితో పోలిస్తే సులభంగా జీర్ణం అవుతాయి.జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది లేకుండా అవసరమైన పోషకాలను అందిస్తాయి.చికెన్, టర్కీ లేదా చేపల వంటి వండిన లీన్ మాంసాలు అవసరమైన ప్రోటీన్ ను సరఫరా చేస్తాయి.
ఇంకా చెప్పాలంటే పుచ్చకాయ వంటి సున్నితమైన పండ్లు జీర్ణక్రియకు ఇబ్బంది కలిగించకుండా ఉంటాయి.ముఖ్యంగా చెప్పాలంటే ఫుడ్ పాయిజన్ అయినప్పుడు తీసుకోకూడని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఫుట్ పాయిజన్ అయినప్పుడు తక్కువగా వండిన ఆహారాలను తీసుకోకూడదు.

ఎందుకంటే అవి ఆహార విషయాలను మరింత పెంచే అవకాశం ఉంటుంది.అలాగే మసాలా ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే మంచిది.వేయించిన ఆహార పదార్థాలను కూడా అసలు తీసుకోకూడదు.
అధిక ఫైబర్ కంటెంట్ ఉన్న పచ్చి పండ్లు( Fruits ) కూరగాయలు, జీర్ణం చేయడం కష్టంగా ఉంటుంది.దీని వల్ల జీర్ణవ్యవస్థ మరింత దెబ్బతింటుంది.
చక్కెర కలిగిన ఆహార పదార్థాలు విరోచనాలను మరింత తీవ్రతరం చేస్తాయి.ప్రాసెస్ చేయబడిన మాంసం జీర్ణ వ్యవస్థను చికాకు పరుస్తుంది.
కార్బోనేటెడ్ పానీయాలు( Carbonated drinks ) ఫుడ్ పాయిజనింగ్ వల్ల కలిగే అసౌకర్యాన్ని ఇంకా పెంచుతాయి.








