సీఎం కేసీఆర్ పాలనపై బీజేపీ విమర్శల వర్షం..

ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన బీజేపీ సీనియర్ నేత , కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా చేసిన తన స్పీచ్ తో తెలంగాణ బీజేపీలో జోష్ నింపారు .ఒకవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై విమర్శల బుల్లెట్లు కురిపిస్తూనే ఇంకోవైపు తెలంగాణ ప్రజలకు హామీల వర్షం కురిపించారు .

 Bjp Criticizes Cm Kcr Rule, Ts Poltics , Cm Kcr , Trs Party , Bjp Party , Bandi-TeluguStop.com

బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజా పాలన అంటే ఏంటో చూపిస్తామని ఒక స్పష్టమయిన క్లారిటీ ఇచ్చిన ట్రబుల్ షూటర్ తెలంగాణలో నిజాం తరహా పాలనా విధానాలకు చరమ గీతం పాడుతామని అన్నారు చంద్ర శేఖర్ రావు జీ చంద్ర శేఖర్ రావు జీ’‘అని గౌరవమిస్తూనే తెరాస పాలనను దుయ్యబట్టారు .బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిధిగా హాజరయిన అమిత్ షా తన తన బలమయిన మాటలతో అధికార పార్టీలో ఊహించని కలవరాన్ని సృష్టించారు .స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చిన దగ్గరనుంచి మరలా స్టేజీ దిగేంతవరకు కూడా ఉత్సాహంతో కనిపించిన అమిత్ షా తన అనుభవంతో కూడిన స్పీచ్ తో ఒక్కసారిగా బీజేపీ కార్యకర్తల్లో ఊహించని కొత్త ఉత్సాహాన్ని నింపారు .అమిత్ షా స్పీచ్ ఆధ్యంతం కూడా టార్గెట్ కేసీఆర్ అన్నట్టుగానే కొనసాగింది.

తెలంగాణలో కేసీఆర్ అంతు తేల్చడానికి నేను రానవసరం లేదు బండి సంజయ్ ఒక్కడు చాలు అని తేల్చేసిన అమిత్ షా , ప్రస్తుతం తెలంగాణలో కుటుంబ పాలనా నడుస్తోంది అని , కేసీఆర్ ఏది చేసినా అందులో తమ కుటుంబానికి మేలు చేకూరేలా జాగ్రత్త పడుతున్నారని వెటకరించారు.నీళ్లు, నిధులు, నియామకాలు.

అంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ హామీలను పక్కన పెట్టేసారని , దళితులకు మూడెకరాల భూమి , ఇంటికో ఉద్యోగం ,డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అంటూ ఊదరగొట్టి ,ఇప్పుడు వాటన్నిటిని గాలికొదిలేశారని మండిపడ్డారు .తాము అధికారంలోకి వస్తే నీళ్లు, నిధులు, నియామకాలు ఖచ్చితంగా చేసి చూపిస్తామని హమిచ్చిన అమిత్ షా కేసీఆర్ కుటుంబ పాలనకు ఫులుస్టాప్ పెట్టవలసిన సమయం ఆసన్నమయిందని అన్నారు .ఇతర రాష్ట్రాల్లో కొనసాగుతున్న పధకాలు తెలంగాణలో ఎందుకు అమలు చేయడం లేదో కేసీఆర్ చెప్పాలని, కేంద్రం అందిస్తున్న కొన్ని పథకాలకు తమ కుటుంబ ఫోటోలు తగిలించుకోవడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు ఇక తెలంగాణ పాలనలో కేసీఆర్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపై ఒకరేంజ్ లో ఫైర్ అయ్యారు అమిత్ షా .నిజాంకు , ఔరంగ జేబు కు మోకరిల్లె విధానాలకు పాతరవేసి, పివి నరసింహారావు వంటి మహనీయులకు చేతులు జోడించే విధానాలను అమలు చేస్తామని క్లారిటీ ఇచ్చారు .

Telugu Amith Sha, Bandi Sanjay, Bjp, Cm Kcr, Formmers, Harish Rao, Revanth Reddy

ప్రస్తుతం హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో కారు స్టీరింగ్ ఓవైసీ అన్నదమ్ముల చేతిలో ఉందని తదుపరి ఎన్నికల నాటికి కారుకు అసలు స్టీరింగ్ లేకుండా చేస్తామని చమత్కరించారు .ప్రస్తుతం నాలుగు శాతంగా ఉన్నటువంటి మైనారిటీ రిజెర్వేషన్లను పూర్తిగా తొలగించి ఎస్సీ ,ఎస్టీ , బీసీ లకు లకు రిజెర్వేషన్ పెంపుదల చేస్తామని తెలిపారు .మజ్లీస్ కు భయపడే.కేసీఆర్ సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం లేదు అని మండిపడ్డారు .రాష్ట్రంలో తమ కార్యకర్తలపై జరుగుతున్నటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని ,ఖమ్మంలో బీజేపీ కార్యకర్త సాయిగణేష్ పై మరణానికి కారణమయిన ఏ ఒక్కర్నీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని మండిపడ్డారు .సచివాలయానికి కూడా రాని ముఖ్యమంత్రిని గద్దె దింపడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని , అందుచేతనే ముందస్తు ఎన్నికలకు రావడానికి కేసీఆర్ భయపడుతున్నారు అని ఎద్దేవా చేశారు .ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయడంలో చంద్రశేఖర్ రావు సర్కారు పూర్తిగా విఫలమైందని , రైతుల కష్టాలను పట్టించుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపిన అమిత్ షా .తాము అధికారంలోకి వస్తే రైతు శ్రేయస్సు పాలన ఎలా ఉంటుందో చూపిస్తామని హామీ ఇచ్చారు .మొత్తానికి ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభ ద్వారా కేసీఆర్ పాలనపై విమర్శల బుల్లెట్లు సంధించిన అమిత్ షా .తాము అధికారంలోకి వస్తే చేయబోయెటువంటి అభివృద్ధికి సంబంధించి కొన్ని స్పష్టమయిన హామీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చారు .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube