'మందిర్‌' కట్టకుండా ఎన్నికలకు వెళుతుందా?

మందిర్‌ అంటే అయోధ్యలో రామ మందిరం.ఇది నిర్మించకుండా భారతీయ జనతా పార్టీ (భాజపా) వచ్చే ఎన్నికల్లో ప్రజల దగ్గరకు వెళుతుందా? అని ప్రశ్నించింది విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పి) ఎప్పడైతే భాజపా అధికారంలోకి వచ్చి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారో అప్పటి నుంచి రామ మందిర నిర్మాణం గురించి వీహెచ్‌పీ తదితర హిందూ సంస్థల గోల ఎక్కువైపోయింది.

మందిరం కడతారా? కట్టరా? అని తరచుగా నిలదీస్తున్నాయి.ఇలా నిలదీయడానికి కారణం.

భాజపా మందిర నిర్మాణాన్ని తన ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టడమే.మందిర నిర్మాణం అత్యంత ప్రధాన అంశమని, మోదీ సర్కారు ఎలాగైనా మందిరం కట్టి తీరాల్సిందేనని వీహెచ్‌పీ చెప్పింది.

వచ్చే ఎన్నికల్లో వైఫల్యం అనే ట్యాగ్‌ పెట్టుకొని భాజపా ప్రజల్లోకి వెళ్లలేదని అన్నది.నాలుగేళ్లలో అయోధ్యలో రామమందిర నిర్మాణం జరుగుతుందనే నమ్మకం తమకు ఉందని విశ్వహిందూ పరిషత్‌ ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

రాముడి ఆలయం ప్రధానమైన అంశమని భాజపా అధ్యక్షుడు అమిత్‌ షా కూడా అంగీకరించారని జైన్‌ చెప్పారు.రాజకీయ పార్టీల నుంచి ప్రజలు కేవలం అభివృద్ధినే కోరుకోరని, తమ నమ్మకాలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కూడా కోరుకుంటారని అన్నారు.

Advertisement

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగించాలని ఈమధ్య వీహెచ్‌పీ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.హిందూ సంస్థలు మందిర్‌పై ఎన్నిసార్లు డిమాండ్‌ చేసినా ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటివరకు ఏమీ మాట్లాడలేదు.

మందిర్‌ నిర్మాణానికి కమిటై ఉన్నామంటే దేశంలో అలజడి రేగడం ఖాయం.ముస్లింలు భాజపాకు దూరమైపోతారు.

వచ్చే ఎన్నికల్లో ఓడిపోవల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.అందులోనూ ఇస్లాం తీవ్రవాదుల నుంచి కూడా ముప్పు ఉన్న ఈ స్థితిలో మందిర నిర్మాణంపై ప్రభుత్వం బహిరంగంగా మాట్లాడలేదు.

గన్నవరంలో వర్షంలో చంద్రబాబు ప్రసంగం..!!
Advertisement

తాజా వార్తలు